స్టార్ హీరో బాలయ్యను ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాలయ్య ఫ్లాప్ సినిమాలు సైతం సీడెడ్ లోని కొన్ని జిల్లాలలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.
అయితే ఈ మధ్య కాలంలో ఒక అభిమాని బాలయ్య హాజరైతే మాత్రమే పెళ్లి చేసుకుంటానని హడావిడి చేసిన సంగతి తెలిసిందే.ఈ ఘటన సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో తెగ వైరల్ అయింది.
అయితే బాలయ్య (Balayya)అభిమానికి తాజాగా పెళ్లి జరిగింది.ఈ పెళ్లికి బాలయ్య హాజరు కాకపోయినా బాలయ్య అల్లుడు భరత్(Bharath) ఈ పెళ్లికి హాజరయ్యారు.బాలయ్య కూడా ఈ పెళ్లికి రావాలని ప్రయత్నించినా చివరి నిమిషంలో వేర్వేరు రీజన్ల వల్ల కుదరలేదని తెలుస్తోంది.అయితే భరత్ మాత్రం కచ్చితంగా బాలయ్యను కలిసేలా తాను ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారని సమాచారం అందుతోంది.
బాలయ్య వీరాభిమాని అయిన ఈ వ్యక్తి పేరు పెద్దినాయుడు కాగా పెళ్లి కూతురు పేరు గౌతమీ ప్రియ(Gautami Priya ) కావడం గమనార్హం.

చిన్నప్పటి నుంచి పెద్దినాయుడు బాలయ్య సినిమాలను ఎంతో ఇష్టంగా చూసేవాడు.అటు పెద్దినాయుడుతో పాటు ఇటు గౌతమి కూడా బాలయ్య అభిమాని కావడం గమనార్హం.బాలయ్య బాబు వస్తారని పెద్దినాయుడు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయించారు.
మార్చి 11వ తేదీ రాత్రి ఈ అభిమాని వివాహం జరిగింది.బాలయ్య సైతం అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

అయితే తారకరత్న(Tarakaratna) మరణం సైతం బాలయ్యను ఎంతగానో బాధ పెట్టిందని కొంతకాలం పాటు శుభకార్యాలకు దూరంగా ఉండాలని బాలయ్య ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.బాలయ్య పెద్దినాయుడు గౌతమిలను ఆశీర్వదిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్నారు.







