టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.పట్టాభిని అరెస్టు చేసి టార్చర్ చేస్తారా.? అంటూ పోలీసులపై మండిపడ్డారు.గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేసిన వారిని పోలీసులే ప్రోత్సహించారని ఆరోపించారు.
బాధితులపై హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు.కొందరు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఫిర్యాదు చేసిన సీఐ బీసీ అంటున్నారు.మరి అలాంటప్పుడు అట్రాసిటీ కేసు ఎలా పెడతారు అని ప్రశ్నించారు.

గన్నవరం ఘటనపై సమగ్ర నివేదిక త్వరలో విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు.గన్నవరం ఘటనలో అరెస్ట్ అయిన పట్టాభి సహా మిగతా టిడిపి కార్యకర్తలకి గన్నవరం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది.దీంతో పట్టాభి ఇంటికి వెళ్లి ఆయన భార్య చందనను పరామర్శించారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.మరోపక్క గన్నవరం ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.







