మల్టీప్లెక్సులలో పాప్ కార్న్ రేట్లపై సినీ డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు.సినిమాను చంపేసే శక్తి పాప్ కార్న్ కు ఉందని చెప్పారు.
ఓటీటీలు, టీవీలతో సినిమాకు ప్రమాదం లేదన్న ఆయన పాప్ కార్న్ తో మాత్రం సినిమాకు ప్రమాదం ఉందని పేర్కొన్నారు.పాప్ కార్న్, కోక్ రేట్లు భయంకరంగా ఉంటున్నాయన్నారు.
సగటు మధ్య తరగతి కుటుంబం పాప్ కార్న్ ధరలను భరించలేదని తెలిపారు.ఈ నేపథ్యంలోనే మల్టీప్లెక్సుల్లో పాప్ కార్న్ అమ్మేవాళ్లు సినిమాను కచ్చితంగా చంపేస్తారని విమర్శించారు.







