యాక్షన్ కింగ్ అర్జున్ కి తెలుగు సినిమా పరిశ్రమ లో మంచి పేరు ఉంది.ఇప్పటి వరకు అతడు వివాద రహితుడుగా కొనసాగుతూ వస్తున్నాడు.
దాదాపు మూడు దశాబ్దాలుగా యాక్షన్ కింగ్ అర్జున్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉంది.ఇండస్ట్రీ లో అతడు మంచి పేరు దక్కించుకున్నాడు.
కన్నడ హీరో అయినప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలు ఎంతో మంది మంచి స్నేహితులను సంపాదించుకున్న అర్జున్ తెలుగు లో మొదటి సారి ఒక సినిమా ను దర్శకత్వం చేసి విడుదల చేయాలని ప్రయత్నించాడు.విశ్వక్‌సేన్ హీరో గా తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా సినిమా ను ప్రారంభించాడు.
కానీ అనూహ్య పరిణామాల నేపద్యంలో సినిమా మధ్య లోనే ఆగి పోయింది.

విశ్వక్‌సేన్ తమకు సహకరించడం లేదంటూ దర్శకుడు కం నిర్మాత అయిన అర్జున్ నిర్మాత ల మండలి లో మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.వీరిద్దరి మధ్య ఏం జరిగింది అంటూ ప్రస్తుతం అందరికీ ఆసక్తి గా మారింది.మాకు అందుతున్న సమాచారం ప్రకారం హీరో విశ్వక్‌సేన్ సినిమా బాగా రావడం కోసం మార్పులు చేర్పులు చెప్పాడని అందుకు అర్జున్ నిరాకరించాడని, దాంతో విశ్వక్‌సేన్ షూటింగ్ కి హాజరు కాకుండా ఇబ్బంది పెడుతున్నాడని తెలుస్తోంది.
కొన్ని సినిమా లకు హీరో లు చెప్పే సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది.కానీ అర్జున్ ఆ దిశగా ఓకే చెప్పక పోవడం తో విశ్వక్‌సేన్ కోపం తో ఉన్నాడని, అందుకే సినిమా నుండి బయటకు వచ్చేసాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
సినిమా పూర్తిగా వాయిదా అయితే పడింది.ఇక కొత్త హీరోతో సినిమా ను చేస్తారా లేదంటే సినిమా ను మొత్తానికి ఆపేస్తారా అనేది చూడాలి.అసలు విషయం ఏంటనేది ఆ పైవాడికే తెలియాలి.







