ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది ప్రజలు చనిపోతున్నారు.రోడ్డుపై ఏదైనా వాహనంలో ప్రయాణించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వెళ్లడం మంచిది.
దీనికి ముఖ్య కారణం ఈ మధ్యకాలంలో యువత అతివేగంతో రోడ్లపై వాహనాలు నడిపి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి.2021 సంవత్సరంలో 1,55,000 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా.ఇందులో సుమారు 70000 మంది బైక్ ప్రమాదానికి గురై చనిపోయినట్లు సమాచారం.
అయితే ఇలాంటి బైక్ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.ఇలాంటి వీడియోలను చూస్తే రోడ్డుపై వాహనాన్ని వేగంగా నడపాలంటే భయపడి పోవాల్సిందే.
అంతా భయంకరంగా ఈ యాక్సిడెంట్ వీడియోలు సోషల్ మీడియాలో ఉంటాయి.ఈ వీడియోలో అక్కడ వాహనాలు వస్తూపోతూ ఉన్నాయి.
బైక్ రైడర్ మెరుపు వేగంగా వచ్చి కారు ముందు భాగం బద్దలయ్యే విధంగా ఢీకొట్టాడు.దీనితో అతని బైక్ ఎగిరిపడి, బైక్ రైడర్ కూడా గాల్లోకి ఎగిరి కింద పడిపోయాడు.

ఈ ప్రమాదాన్ని ఒక కారు నడుపుతున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడా లేదా అనేది ఎలాంటి సమాచారం లేదు.ఎందుకంటే ఈ వీడియోని చూస్తే బైక్ వేగంగా నడవాలంటే వణుకు పుడుతుంది.ఇంకా చెప్పాలంటే ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది అనేది కూడా సమాచారం లేదు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి చాలామంది రకరకాల కామెంట్ చేస్తున్నారు.
ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడని కొంతమంది, ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.కాబట్టి ఎప్పుడూ రోడ్లపై వేగంగా వెళ్లి తన ప్రాణాలను కాకుండా ఏ పాపం తెలియని అమాయక ప్రజలను కూడా ప్రమాదానికి గురి మంచి పద్ధతి కాదు.







