మాస్ మహా రాజా కరోనా తర్వాత ఫుల్ జోష్ గా మారిపోయాడు.ఆయన ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
రెమ్యునరేషన్ పెంచిన కూడా రవితేజ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.క్రాక్ కిరాక్ హిట్ అవ్వడంతో ఈయనకు మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయి.
ఈయన ఏకంగా పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ఖిలాడీ’ సినిమా రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది.
ఈ సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా’ సినిమా చేస్తున్నాడు.ఇక వీటితో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అలాగే స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమాను చేస్తున్నాడు.
ఇంకా వంశీ కృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కనుంది.
తాజాగా రామారావు ఆన్ డ్యూటీ నుండి లిరికల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.

ప్రెసెంట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా దీంతో వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.ఈ క్రమంలోనే రామారావు ఆన్ డ్యూటీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటుంది.

ఇపప్టి వరకు వచ్చిన ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్ అన్ని కూడా యాక్షన్ ను ఎలివేట్ చేస్తే.బుల్బుల్ తరంగ్ అంటూ సాగే సాంగ్ మాత్రం రొమాంటిక్ గా సాగనున్నటు తెలుస్తుంది.ఇందులో రవితేజ, రజిషా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటున్నారు.రవితేజ హ్యాండ్సమ్ గా ఉండగా, రజిషా హాఫ్ శారీలో అందంగా కనిపిస్తుంది.ఈ పోస్టర్ అంఎందరిని ఆకట్టు కుంటుంది.







