టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ లో మరో ఐదు నిబంధనలు చేర్చాలని సీఐడీ పిటిషన్ వేసింది.
ఈ మేరకు రాజకీయ యాత్రలు, సభలు, ప్రసంగాలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించాలని సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.వైద్యం కోసమే బెయిల్ ను ఉపయోగించుకునేలా నిబంధన విధించాలని కోర్టును కోరింది.
కేసుకు సంబంధించిన వివరాలను పబ్లిక్, మీడియా ముందు మాట్లాడకూడదని తెలిపింది.ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు చంద్రబాబుతో ఉంటూ ఆయన కదలికలు కోర్టుకు సమర్పించాలని పిటిషన్ లో పేర్కొంది.
సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.