Chiranjeevi Waltair Veeraya : మరో వారం రోజుల్లో వీరయ్యని సర్ధేస్తారట.. ఫ్యాన్స్‌ వెయిటింగ్‌

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అంతకు ముందు ఆచార్య నిరాశ పర్చడం తో గాడ్ ఫాదర్ ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూశారు.

 Chiranjeevi Waltair Veeraya Movie Shooting Update,chiranjeevi,waltair Veeraya,go-TeluguStop.com

గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ అవ్వడం తో తదుపరి సినిమా విషయం లో అంతా ఆసక్తి గా ఉన్నారు.ఈ సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.

డిసెంబర్ నెల రాబోతున్న నేపథ్యం లో ఇంకా వాల్తేరు వీరయ్య సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.ఎట్టకేలకు సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

మరో వారం రోజుల్లోనే వాల్తేరు వీరయ్య సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవుతాయంటూ మైత్రి మూవీ మేకర్స్ నుండి అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.

Telugu Chiranjeevi, God, Telugu, Waltair Veeraya-Movie

డిసెంబర్ రెండవ వారం కు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారని సమాచారం అందుతుంది.సినిమా యొక్క ఫస్ట్ కాపీ డిసెంబర్ మూడవ వారం లేదా నాలుగవ వారం కి రెడీ అయ్యేలా ప్లాన్ చేశారు.జనవరి మొదలుకొని విడుదల వరకు దాదాపు రెండు వారాలకు పైగానే కంటిన్యూగా సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి యొక్క ఐదు లేదా ఏడు రోజుల డేట్స్ ని సినిమా ప్రమోషన్ కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు కోరినట్లుగా తెలుస్తోంది.మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తి అయితే ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగే అవకాశాలు ఉన్నాయి.

ఆ టైం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube