కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమాను లైన్లో పెడుతుంటాడు.ఈ విషయం అందరికి తెలిసిందే.
ఈ ఏడాది అప్పుడే వారిసు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ ఇప్పుడు 10 నెలల్లోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ఒక సినిమాను రిలీజ్ కు పెట్టి మరో సినిమాను స్టార్ట్ చేయడానికి కూడా సిద్ధం అవుతున్నాడు.

విజయ్ దళపతి నెక్స్ట్ తన 68వ సినిమాను కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో చేయనున్నాడు అని ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ప్రకటన తోనే అంచనాలు భారీగా పెరిగాయి.

అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి ఈ సినిమా నుండి ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తూనే ఉంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా మెయిన్ క్యాస్ట్ ఇది అంటూ ఒక రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.టాక్ ప్రకారం ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) హీరోయిన్ గా నటిస్తుండగా నటి స్నేహ, నటుడు జైరాం, జీన్స్ నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్ లు అయితే మెయిన్ క్యాస్ట్ అని తెలుస్తుంది.

మొత్తానికి వెంకట్ ప్రభు భారీ ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు.చూడాలి మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.ఇక విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ”లియో”( Leo ) సినిమా చేస్తున్న విషయం విదితమే.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నారు.
సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.







