World Oceans Day: సముద్రాలు లేకపోతే మనుషులకు మనుగడే లేదు... అవి లేని ప్రపంచం ఉంటుందంటే!

నేడు World Oceans Day అని ఎంతమందికి తెలుసు? సముద్రానికి మనిషికి విడదీయలేని అనుబంధం వుంది.ఒకప్పుడు సముద్రం గుండానే ప్రయాణాలు సాగేవి.

 World Oceans Day Without The Oceans Humans Would Not Exist A World Without Them-TeluguStop.com

విమానాలు వచ్చాక నీటిపై ప్రయాణాలు అనేవి కాస్త తగ్గాయనే చెప్పుకోవాలి.అయితే ఏదిఏమైనా ఇక్కడ సముద్రయానాలకే ప్రత్యేకత ఎక్కువ.

ఎందుకంటే నీటి ప్రయాణమనేది మధ్యతరగతి వారికి కూడా కాస్త అందుబాటులో ఉంటుంది కనుక.ఇక మనం భూమిపై ఎంత ఆధారపడి బతుకుతున్నామో, పరోక్షంగా సముద్రాలపై కూడా అంతే ఆధారపడి జీవిస్తున్నాం.

పర్యావరణ సమతుల్యానికి, మనిషి జీవించే వాతావరణం ఉండేందుకు సముద్రాలు ఎంతో ఉపకరిస్తున్నాయనే విషయం తెలుసా?

సముద్రాలే లేకుంటే మనిషి బతకడం చాలా కష్టం.ఎందుకంటే అవి లేకపోతే, వాతావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది.

భూమిపై వాతావరణ మార్పులపై సముద్రాలు ఎంతో ప్రభావం చూపిస్తాయి.అన్నింటి కన్నా ముఖ్యంగా వర్షాలు, రుతు పవనాలు రాక సముద్రాల వల్లే వీలవుతుంది.

రుతుపవనాలే రాకపోతే భూమి పరిస్థితి, భూమిపై నివసించే మనుషులు ఏమవుతారో ఊహించుకోవడానికి కష్టమే.తుఫానులు, గాలులకు సముద్రాలే ముఖ్యం.

భూమిపై ఉష్ణోగ్రతలను పూర్తిగా నియంత్రించేది సముద్రం మాత్రమే.

Telugu Latest, Spcilatiy, Ocean Day-Latest News - Telugu

భూమిపై వున్న గాలిలో కొన్ని విషపూరితమైన వాయువులను కూడా సముద్రం పీల్చుకుంటుంది.దీని వల్ల మనుషులపై వాటి ప్రభావం ఉండదు.అందువలన సముద్రాలు లేని భూమిపై మనిషి ఎంతో కాలం జీవించ లేడు.

కరవు కాటకాలతో మానవజాతే అంతరించిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇక సముద్రంలో ఉండే మత్స్య సంపద వలన ఇక్కడ కొన్ని కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్నారు.

వాటిని అమ్ముకోవడం ద్వారా వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.సముద్రాలు కోట్లాది మందికి ఆహార భద్రతలను, ఉపాధిని కల్పిస్తున్నాయి.2030 నాటికి సముద్ర ఆధారిత పరిశ్రమల ద్వారా 40 మిలియన్ల మంది ఉపాధి పొందుతారని అంచనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube