సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాలెంట్ తో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలు నటుడిగా విజయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
జయాపజయాలకు అతీతంగా సినిమాసినిమాకు క్రేజ్ పెంచుకుంటున్న విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ టాక్ షోకు గెస్ట్ గా హాజరై ప్రేక్షకులకు ఎన్నో కొత్త విషయాలను వెల్లడించారు.
విజయ్ దేవరకొండ లాక్ డౌన్ సమయంలో ఇంటి పనులు చేయాలని అనుకున్నానని కానీ ఎక్కువగా చేయలేకపోయానని అన్నారు.
చాలామంది తను ఎక్కువగా దానధర్మాలు చేస్తానని భావిస్తూ ఉంటారని కానీ అది నిజం కాదని అన్నారు.తనకు సాయం చేయడం ఇష్టమైతేనే చేస్తానని, లేకపోతే చేయనని .తనకు నచ్చకపోతే ఎవరేం అనుకున్నా సాయం చేయనని విజయ్ చెప్పారు.తాను అందరూ అనుకుంటున్న విధంగా దానధర్మాలు చేయనని.తాను అలాంటివాడిని కాదని అన్నారు.

గత కొన్నేళ్లుగా వరుసగా సినిమాలకు కమిటవుతూ షూటింగ్ లతో బిజీగా గడిపానని, మొదట్లో లాక్ డౌన్ సమయంలో తింటూ పడుకుంటూ సంతోషంగా గడిపానని కానీ ఆ తర్వాతే లాక్ డౌన్ వల్ల ఏం నష్టపోతున్నానో అర్థమైందని అన్నారు.మానసిక సమస్యల గురించి మాట్లాడిన విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎవరికైనా మానసిక సమస్యలు ఎదురైతే మానసిక నిపుణులను సంప్రదించాలని సూచించారు.
మానసిక సమస్యలు ఎదురైన సమయంలో తమలో తాము బాధ పడవద్దని అన్నారు.లైఫ్ లో ఎగుడుదిగుడులు సహజమని.స్నేహితులతో తరచూ మాట్లాడుతూ మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలని అన్నారు.సీరియల్ కిస్సర్ అనే ట్యాగ్ గురించి సమంత ప్రశ్నించగా మహానటి సినిమాలో సమంతతో నటించినా ఆమెను ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేదని అందువల్ల తాను సీరియల్ కిస్సర్ ను కాదని చెప్పారు.