రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే రేపు ఈ చిత్రం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
కాని ఎన్నికల సీజన్ కారణంగా ఈ రాజకీయ నేపథ్యం మూవీ విడుదల కాకుండా అడ్డుకోవాలి అంటూ ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.దాంతో సినిమా ఆగిపోయింది.
సెన్సార్ కార్యక్రమాలు కానందు వల్ల సినిమాను విడుదల చేయలేని పరిస్థితి.తాజాగా హైకోర్టు వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎన్నికల కోడ్ పేరు చెప్పి సినిమాను అడ్డుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని, సినిమాకు సంబంధించిన విషయాల్లో ఎన్నికల కోడ్ ఎలాంటి అడ్డు కాదని కోర్టు పేర్కొంది.దాంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు మరోసారి సిద్దం అవుతుంది.
ముందు నుండి అన్న డేటు 22కు కాకుండా ఈనెల 29వ తారీకున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఎన్నికల ముందు ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయనీయవద్దని తెలుగు దేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు.అందుకోసం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంది.అందుకే ఈ చిత్రం విడుదల విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.థియేటర్‌లో బొమ్మ పడే వరకు ఈ సినిమా విడుదల విషయంలో నమ్మకం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
