శని త్రయోదశి రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ ఆరవ తేదీన శనివారం రోజు( Saturday ) త్రయోదశి వచ్చింది.ఈ రోజు శనికి ఎంతో ఇష్టమైన రోజు అని పండితులు చెబుతున్నారు.

 Shani Trayodashi Devotees Follow These Remedies Details, Shani Trayodashi ,devot-TeluguStop.com

ఈ రోజు కొన్ని నియమాలు పాటించడం వల్ల శని ప్రభావం( Shani Effect ) నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి.మనిషి చేసే పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనీశ్వరుడు గమనిస్తూ ఉంటారు.

Telugu Anjaneya Swamy, Devotees, Saturday, Shani Dev, Shani Effect, Shani, Surya

బతికి ఉండగా చేసే పాపపుణ్యాలను శని పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తిగా వ్యవహరిస్తే మరణం తర్వాత పాపపుణ్యాల ఆధారంగా యమధర్మరాజు శిక్షలు అమలు చేస్తారు.అలాగే శని త్రయోదశి( Shani Trayodashi ) రోజు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.శనివారం రోజు సూర్యోదయానికి ముందే తల స్నానం చేయాలి.ఆరోగ్యం సహకరించే వారు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయాలి.శని త్రయోదశి రోజు మద్యం, మాంసాలు ముట్టుకోకూడదు.శివార్చన, ఆంజనేయ స్వామి ఆరాధన ద్వారా శని ప్రభావం తగులుతుంది.‘ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలని పండితులు చెబుతున్నారు.

Telugu Anjaneya Swamy, Devotees, Saturday, Shani Dev, Shani Effect, Shani, Surya

ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి.మూగజీవులకు కూడా ఏదైనా తినిపించాలి.రోజుకో నువ్వుల ఉండను కాకికి( Crow ) తినిపించడం మంచిది.

శనివారం రోజు రొట్టెపై నువ్వులు వేసి కుక్కలకు పెడితే శని ప్రభావం తగ్గుతుంది.ఆంజనేయ స్వామి( Anjaneya Swamy ) ఆరాధన వల్ల శని ప్రభావం తగ్గుతుంది.

సుందరకాండ పారాయణం చేయాలి.కాలువలో కానీ, నదిలో కానీ, బొగ్గులు, నల్ల నువ్వులు, మెకు తీసుకొని శనికి నమస్కరించి వేయాలి.

బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు పిడితే శని ప్రభావం దూరం అవుతుంది.ప్రతి శనివారం రాగి చెట్టుకు ప్రదక్షణం చేయాలి.

శనివారం రోజు శివాలయం ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టి, నల్ల దుప్పటి దానం చేస్తే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube