బన్నీ వల్లే మలయాళంలో తెలుగు సినిమాలు తెలుసట.. అల్లు అర్జున్ క్రేజ్ కు ఫిదా అవ్వాల్సిందే!

మంజుమ్మల్ బాయ్స్.( Manjummel Boys ) ఈ మలయాళం సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి సక్సెస్ ని సాధించిన విషయం తెలిసిందే.

 Manjummel Boys Movie Director Chidambaram Interesting Comments On Allu Arjun And-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 200 కోట్లు కలెక్షన్స్ సాధించింది.అంతేకాకుండా ఈ రేంజ్ లో కోట్లు కలెక్ట్ చేసిన మొదటి మలయాళీ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది.

ఈ సినిమా గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు.కొంతమంది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్ ఒక ట్రిప్ కి వెళ్తే ఆ ట్రిప్ లో కొండ గుహల్లోకి వెళ్తే అక్కడ లోయలో పడిన ఒక ఫ్రెండ్ ని ఎన్ని కష్టాలు పడి బయటకు తీశారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

Telugu Allu Arjun, Chidambaram, Malayalam, Manjummel, Tamil, Telugu, Tolllywod-M

ఇప్పుడు ఈ మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది.రేపు ఏప్రిల్ 6న మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో రిలీజ్ అవుతోంది.ఈ సినిమాలో నటించిన పలువురు నటులు, దర్శకుడు చిదంబరం( Director Chidambaram ) తెలుగులో కూడా ప్రమోషన్స్ కి వచ్చారు.ఈ సందర్భంగా డైరెక్టర్ చిదంబరం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు.

ఈ ఇంటర్వ్యూలో మీకు నచ్చిన తెలుగు సినిమాలు, మీరు చూసిన తెలుగు సినిమాలు( Telugu Movies ) చెప్పండి అని అడగ్గా.అంతకుముందు నాకు తెలీదు కానీ నా జనరేషన్ లో మాత్రం బన్నీ సినిమా నుంచే తెలుగు సినిమాలు తెలుసు.

Telugu Allu Arjun, Chidambaram, Malayalam, Manjummel, Tamil, Telugu, Tolllywod-M

ఆ తర్వాత అల్లు అర్జున( Allu Arjun ) సర్ సినిమాలన్నీ అక్కడ రిలీజ్ అయి మంచి విజయాలు సాధించాయి.వాటి వల్లే మాకు తెలుగు సినిమాలు అలవాటు అయ్యాయి.రాజమౌళి, సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఇష్టం.అరుంధతి సినిమా అంటే కూడా ఇష్టం.పాత మాయాబజార్ సినిమా మాత్రం సినిమా వాళ్లందరికీ ఒక బుక్ లాంటింది అని తెలుగు సినిమాల గురించి తెగ పొగిడేసాడు.ఇక ఈ ఇంటర్వ్యూలో ఇక్కడ తెలుగులో మంజుమ్మల్ బాయ్స్ సినిమా తీస్తే ఏ హీరోలని, ఎవర్ని తీసుకుంటారు బాయ్స్ గా అని అడిగారు.

దీనికి దర్శకుడు చిదంబరం సమాధానమిస్తూ.అస్సలు ఆలోచించలేదు.

కానీ చాలా వరకు యువ హీరోలని తీసుకుంటాను.అల్లు అర్జున్, నాని, నవీన్ పోలిశెట్టి, రానా.

ఇలాంటి వాళ్ళని తీసుకుంటాను అని తెలిపాడు.దీంతో మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube