దర్శకుడు కి విశ్వనాధ్ గారు కన్ను మూసిన క్షణం నుంచి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.ఆయనకు సంబంధించిన అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నీరాజనాలు పడుతున్నారు.
విశ్వనాధ్ గారు తీసిన ప్రతి సినిమా గురించి ఒక గొప్ప జ్ఞాపకం తట్టి లేపుతూ హృదయాలను స్పురిస్తున్నారు.శంకరాభరణం వంటి సూపర్ హిట్ సినిమా నే కాకుండా సాగర సంగమం వంటి అద్భుతమైన సినిమాను తీసిన ఘనత ఆయన సొంతం.
ఇక ఆయన జీవితంలో ఎంతోమంది స్టార్ హీరోలతో పనిచేశారు ముఖ్యంగా కమలహాసన్ నీ దత్త పుత్రుడిగా భావిస్తూ ఉంటారు.
అయితే విశ్వనాధ్ గారు ఎంత మంచిని అయితే సంపాదించుకున్నారో కొన్ని విషయాల్లో చెడ్డపేరు కూడా ముడగట్టుకున్నారు.మరీ ముఖ్యంగా ఆయన మామూలు నటులతో తప్ప స్టార్ హీరోలతో సినిమాలు చేయలేరు అని ఒక అపవాదులు చాలా ఎళ్లు మోసారు.నిజానికి అది ఏమాత్రం కరెక్ట్ కాదు.
చిరంజీవి వంటి స్టార్ హీరోతో మూడు సినిమాలు తీశారు విశ్వనాథ్ గారు.ఈ మూడింటిలో రెండు సినిమాలు తను మామూలు హీరోగా ఉన్నప్పుడు అలాగే ఒక సినిమా స్టార్ హీరో అయ్యాక కూడా తీశారు.
అలాగే కమల్ హాసన్ తో మూడు సినిమాలు చేశారు. వెంకటేష్ తో కూడా రెండు సినిమాలు చేసిన అనుభవం విశ్వనాథ్ గారి సొంతం.
వెంకటేష్ తో చిన్నబ్బాయి, స్వర్ణకమలం సినిమాలు తీశారు.సాగర సంగమం, స్వాతిముత్యం అంటే సినిమాలతో కమల్ హాసన్ కెరియర్లో ఎంతో గుర్తిండిపోయే చిత్రాలను అందించిన ఘనత విశ్వనాథ్ గారికి దక్కింది.ఇక స్టార్ హీరోలతో కొన్నాళ్లపాటు సినిమాలు చెయ్యి అని విషయం వాస్తవమే అయినప్పటికీ అది పూర్తిగా అయితే కాదు మరోవైపు స్టార్ హీరోలతో సినిమా తీస్తే వాళ్ళు చెప్పినట్టు వినరు అనే ఒక అనుమానం ఆయనలో ఉండేది.అందుకు ఉదాహరణ జనని జన్మభూమి.
ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించిన అది సగం సినిమా ఆయన శిష్యులే దర్శకత్వం వహించాలని అంటూ ఉంటారు.అంతలా ఆయన్ని ఎలా ఇబ్బంది పెట్టారో బాలకృష్ణ మరి.