అవును, ఆ సినిమాని రిలీజైనపుడు మొదట రెండు మూడు వారాలు ఎవడూ చూడలేదు కానీ తర్వాత ఆస్కార్ రేంజ్ సినిమా అని థియేటర్లకు కుటుంబాలతో సహా క్యూలు కట్టి మరీ చూసారు.ఒక ఘటన చూసిన తర్వాత ఓ కుర్రాడిలో డబ్బు గొప్పదా? మానవత్వం గొప్పదా? అనే ఆలోచన తొలిచేసింది.అనుకున్నదే తడవుగా తన ఆలోచనలని ఒక కథగా తీర్చిదిద్దాడు.ఆ కథకి ‘అంతిమయాత్ర’( Anthimayatra ) అనే పేరు పెట్టాడు.ఆ కుర్రాడి పేరు మదన్.( Madan ) ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.
గోపాలరెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టైమ్‌లో ఈటీవీలో సీరియల్ కోసం కథ చెప్పడానికి ఈటీవీ ఆఫీస్‌కి వెళ్ళాడు.ఆ సంస్థలోని ఓ ప్రముఖ్య వ్యక్తి ఎదురుగా కుర్చీని కథ చెప్పడం మొదలుపెట్టాడు మదన్.
ఒక వ్యక్తి చనిపోతాడు.అదే మొదటి సీన్ అని చెప్పగానే అది విన్న సదరు వ్యక్తి ఈ కథతో ఎక్కువ ఎపిసోడ్స్ చెయ్యలేం అంటూ పదినిమిషాల్లోనే కథను రిజెక్ట్ చేశాడు.

తరువాత అదే కథను ఎంతో మందికి వినిపించాడు మదన్.కానీ, ఎక్కడా దారి దొరకలేదు.చివరికి అట్లూరి పూర్ణచంద్రరావుకి కథ చెప్పగా ఆయనకి బాగా నచ్చింది.వెంటనే అతన్ని ఊటీ పంపించి నెల రోజులు టైమ్ ఇచ్చి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని రమ్మని చెప్పారు.
ఆయన చెప్పినట్టుగానే మదన్ ఫుల్ స్క్రిప్ట్‌తో తిరిగి వచ్చాడు.తరువాత చెన్నయ్ నుంచి కె.భాగ్యరాజాను పిలిపించారు అట్లూరి.ఎందుకంటే కథలపై ఆయనకు మంచి జడ్జిమెంట్ ఉంటుంది.
మదన్ చెప్పిన కథ విని చలించిపోయాడు భాగ్యరాజా.తెలుగు, తమిళ భాషల్లో తానే డైరెక్ట్ చేసి హీరోగా కూడా తనే చేస్తానని చెప్పాడు.
అయితే అది అట్లూరికి నచ్చలేదు.ఈ సినిమాలో ఎవరు నటించాలి అనే విషయంలో ఆయనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.

ఒక దశలో ప్రకాష్‌రాజ్‌ని అనుకొని ఆయనకి వినిపించారు.కథ విన్న ప్రకాష్‌రాజ్.( Prakash Raj ) సినిమా కంటే నవలగా అయితే బాగుంటుంది.ట్రై చెయ్యమని ఉచిత సలహా ఇచ్చారు.
దాంతో మదన్‌కి విసుగొచ్చేసింది.ఈ క్రమంలో మదన్ దగ్గర మంచి కథ ఉందని, వెంటనే దాని రైట్స్ తీసుకోమని దర్శకుడు చంద్రసిద్ధార్థ్ సోదరుడు చెప్పాడు.
అప్పటికే ఆ కథపై నమ్మకంతో ఎన్నో ప్రయత్నాలు చేసిన అట్లూరి కూడా విసిగిపోయి చంద్రసిద్ధార్థ్ అడగ్గానే నో చెప్పకుండా రైట్స్ ఇచ్చేశారు.ఆ కథను సినిమాగా తీసేందుకు ప్రేమ్‌కుమార్ పట్రా ఓకే చెప్పారు.
ఈ సినిమాలోని ప్రదాన పాత్ర ఎవరితో చేయించాలి అనే విషయంలో తర్జనభర్జలు పడిన తర్వాత రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) అయితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు.రాజేంద్రప్రసాద్‌తో టైమ్ ఫిక్స్ చేసుకున్నారు.
కథ పూర్తి కాగానే రాజేంద్రప్రసాద్ మారుమాట్లాడకుండా వెంటనే సినిమా స్టార్ట్ చేసెయ్యాలి.ఎంత ఆపుకుందామనుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు అన్నారట.

కట్ చేస్తే తర్వాత కొన్ని రోజులకు సరిగ్గా డిసెంబర్ 9, 2004లో ‘ఆ నలుగురు’( Aa Naluguru Movie ) రిలీజ్ అయింది.27 ప్రింట్లతో రిలీజ్ చేస్తే 16 ప్రింట్లు రిటర్న్ వచ్చేశాయి.మొదటి 2 వారాలు కలెక్షన్లు నిల్.ఇక మూడో వారం మొదటి రోజు నుండీ అందరూ షాక్ అయ్యారు.మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు దుమ్ము దులిపేసింది సినిమా.ఫామిలీ ఆడియన్స్ పిచ్చి పిచ్చిగా చూసేసారు.
రోజు రోజుకీ థియేటర్లు పెరుగుతూ వెళ్ళాయి.సినిమా చూసిన వాళ్ళంతా యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ అభినందించారు.
ఆ సంవత్సరం ‘ఆ నలుగురు’ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు( Nandi Award ) అందుకుంది.ఉత్తమ నటుడుగా రాజేంద్రప్రసాద్, ఉత్తమ సహాయ నటుడిగా కోట శ్రీనివాసరావు నందులు అందుకున్నారు.







