గురుగ్రామ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఓ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను ఇటీవల వాహనాలను చెక్ చేస్తున్నారు.
కాగా ఈ సమయంలోనే ఒక ఎస్‌యూవీ డ్రైవర్ ఆ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను దాదాపు 50 మీటర్లు ఈడ్చుకెళ్లి.తన వాహనంతో తొక్కించి పారిపోయాడు.
ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం అంబేద్కర్ చౌక్, సెక్టార్ 52 వద్ద జరిగింది.వాహనాల తనిఖీ సమయంలో ఆపమని సూచించిన ఎస్ఐని ఈ ఎస్‌యూవీ డ్రైవర్ ఢీకొట్టాడు.
ఆపై లాక్కెళ్లి తొక్కిచ్చాడు.ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీస్ తీవ్రంగా గాయపడ్డారు.
కాగా ప్రస్తుతం అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ పరిస్థితి విషమంగా ఉంది.ఈ సంఘటనలో కాలు కూడా విరిగింది.
వివరాల్లోకి వెళితే.ఏఎస్సై హర్‌ప్రీత్ (35) శుక్రవారం హోంగార్డు, కానిస్టేబుల్‌తో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.కాగా సరిగ్గా సాయంత్రం 4:30 గంటలకు హర్‌ప్రీత్ స్పీడ్ గా వస్తున్న ఎస్‌యూవీని గమనించి, దాని డ్రైవర్‌ను పక్కకు ఆగమని సూచించారు.కాగా ఎస్‌యూవీ డ్రైవర్ ఆపకుండా వేగంగా దూసుకొచ్చాడు.
ఈ సమయంలో అడ్డొచ్చిన హర్‌ప్రీత్‌ను 50 మీటర్ల వరకు లాక్కెలాడు.అతను కిందపడిపోవడంతో అతనిపై నుంచి కారు పోనిచ్చాడు.
ఈ ఘటన చూసిన మిగతా పోలీసులు ఏఎస్ఐని ఆస్పత్రికి తరలించారు.

కానిస్టేబుల్ సోంబీర్ ఫిర్యాదుపై సెక్టార్ 53 పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.అతనిని కనుగొనడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.“మేం సీసీటీవీ ఫుటేజీ సహాయంతో వాహనాన్ని గుర్తించాం.రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా దాని యజమానిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం.త్వరలో నిందితులను పట్టుకుంటాం” అని సెక్టార్ 53 పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ అమిత్ కుమార్ తెలిపారు.







