స్టార్ హీరోయిన్ సమంత తన అనారోగ్య సమస్య గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించటంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి, సామాన్య ప్రజల నుంచి సమంత త్వరగా కోలుకోవాలంటూ మెసేజ్ లు వైరల్ అవుతున్నయి.చిరంజీవి తన పోస్ట్ లో డియర్ సమంత.
కాలానుగుణంగా మన లైఫ్ లో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని ఆ సవాళ్ల వల్ల మన శక్తిసామర్థ్యాలు ఏంటో మనకు అర్థమవుతుందని పేర్కొన్నారు.
సమంత మనోబలం కలిగిన అద్భుతమైన అమ్మాయి అని అతి త్వరలో సమంత ఈ సమస్యను అధిగమిస్తుందనే నమ్మకం ఉందని చిరంజీవి పేర్కొన్నారు.
చిరంజీవి చేసిన పోస్ట్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.సమంత కష్టాల్లో ఉన్న సమయంలో చిరంజీవి తన వంతుగా ధైర్యం చెప్పడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.సమంత త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సమంతలో ఆత్మస్థైర్యం నింపే విధంగా ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతుండటం గమనార్హం.మయోసైటిస్ ప్రాణాంతకం అని కొంతమంది చెబుతుండగా మరి కొందరు ఈ వ్యాధి మరీ ప్రమాదకరం కాదని వెల్లడిస్తున్నారు.గత కొంతకాలంగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ కావాలని సమంత అభిమానులు కోరుకుంటున్నారు.
సమంత నటించిన యశోద మూవీ నవంబర్ నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాలోని యశోద పాత్రకు సమంత డబ్బింగ్ చెప్పుకున్నారు.
హరి హరీష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతలకు లాభాలను అందించిందని బోగట్టా.
సమంత నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తైంది.సరైన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే పనిలో శాకుంతలం మేకర్స్ బిజీగా ఉన్నారని బోగట్టా.