సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు.అయితే వారికి ఏ మాత్రం విరామం దొరికిన హాలిడే వెకేషన్ కోసం ఇతర దేశాలకు వెళ్లి పెద్ద ఎత్తున వారి సమయాన్ని గడుపుతూ ఉంటారు.
అయితే కొన్నిసార్లు హీరోయిన్లలో కూడా ఆధ్యాత్మిక భావన కలిగి పలుసార్లు ఆలయాలను సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఓనటి గంగానది తీరాన గంగా నదికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు.
మాస్క్ వేసుకొని గంగానదికి మొక్కులు చెల్లించుకుంటున్న ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.
ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ఓ క్రికెటర్ తో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.ఇలా పెళ్లి తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈనటి ప్రస్తుతం ఇండస్ట్రీకి కాస్త దూరమయ్యారని చెప్పాలి.
ఆమె ఎవరో గుర్తొచ్చింది కదా అవును అందరూ అనుకున్నట్టే ఆమె అనుష్క శర్మ. విరాట్ కోహ్లీతో ప్రేమలో పడిన తర్వాత తనని పెళ్లి చేసుకుని కూతురికి జన్మనిచ్చిన ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమయ్యారు.
అడపాదడపా సినిమాలలో నటిస్తూ నిర్మాతగా కూడా కొనసాగారు.ఇకపోతే తాజాగా ఈమె తన కూతురు వామికతో కలిసి కోల్ కత్తా వెళ్లారు.ఈ క్రమంలోనే అనుష్క శర్మ గంగా నది తీరాన గంగ నదికి ప్రత్యేక పూజలను చేసి మొక్కు తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అనుష్క శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఆమె ఝులన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చక్డా ఎక్స్‌ప్రెస్ లో లీడ్ రోల్ పోషిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.