మెగాస్టార్ పేరును మార్చడానికి అసలు కారణం చెప్పిన గాడ్ ఫాదర్ టీమ్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి పునాదిరాళ్లు సినిమా ద్వారా హీరోగా మారాడు.

 The God Father Team That Gave The Reason For Changing Chiranjeeevi Name Details,-TeluguStop.com

అప్పటినుండి వరుస విజయాలు అందుకుంటూ మెగాస్టార్ గా గుర్తింపు పొందాడు.అయితే రాజకీయ పార్టీ పెట్టడం వల్ల కొంతకాలం సినిమాలకు దూరమైన చిరంజీవి మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఇప్పటికీ చిరంజీవి కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నాడు.

ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా విడుదలై డిజాస్టర్ గా నిలిచింది.

ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ఇటీవల ఈ సినిమా నుండి చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అంతే కాకుండా ఈ సినిమా నుండి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా గాడ్ ఫాదర్ సినిమా కోసం చిరంజీవి తన పేరు మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Acharya, Bhola Shankar, Chiranjeevi, Mohan Raja, God, Chiranjeeevi, Neume

ఇటీవల విడుదల చేసిన వీడియోలో ‘Megastar chiranjeevi’ గా ఉండాల్సిన పేరు ‘Megastar chiranjeeevi’ అని ఉంది.అందువల్ల న్యూమరాలజీ ప్రకారం చిరంజీవి తన పేరు మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఆచార్య సినిమా యూనిట్ ఈ వార్తలను ఖండించింది.

సినిమా యూనిట్ ఈ వీడియో ని ఎడిట్ చేసే సమయంలో జరిగిన తప్పిదం వల్ల చిరంజీవి గారి పేరు అలా ఉందని, ఈ సినిమా కోసం చిరంజీవి గారు పేరు మార్చుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది.ఎడిటింగ్ లో పొరపాటు జరగటం వల్ల పేరు ఇలా ఉంది.

మరొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సినిమా యూనిట్ పేర్కొంది.ఈ వీడియోలో చిరంజీవి పేరు ఇప్పుడు కరెక్ట్ గా ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube