ఏపీలో ఆదానికి కట్టబెట్టిన ఆస్తులు ఎన్నో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించాలి.- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్.
దేశమంతా హిండెన్ బర్గ్ నివేదికపై చర్చిస్తుంటే ఏపీలో హడావిడిగా మంత్రివర్గ సమావేశం జరిపి, ఆదానీకి భూములు కట్టబెట్టడంలో మర్మమేంటి?తెలంగాణలో ఆదానీ కంపెనీలను తిరస్కరించినా, ఏపీలో ఎందుకు అనుమతించారు?దశాబ్దాలుగా ఏపీలో పాల ఉత్పత్తుల డైరీలు ఉన్నప్పటికీ, గుజరాత్ కు చెందిన అమూల్ డైరీని ఏపీలో అనుమతించడం వెనక లాలూచీ ఏంటి?ఆదానీ, అమిత్ షా, జగన్ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాలను బయటపెట్టాలి.- రామకృష్ణ.