అగ్రహీరోల సినిమా ఎంట్రీ వెనుక ఉన్నది ఎన్టీఆరేనా ? 

సినిమా రంగంలో హీరో హీరోయిన్ లేదా నిర్మాతల బిడ్డలు రాజ్యమేలడం మాములుగా చూస్తూనే ఉన్నాము .టాలీవుడ్ లో ఆ విధంగా నందమూరి మరియు అక్కినేని కుటుంబాల నుండి ఎందరో నటీనటులు వచ్చి ప్రేక్షకులను అలరించారు.

 Senior Ntr Behind Top Heroes Entry To Film Industry,senior Ntr,nepotism,akkineni-TeluguStop.com

అదే విధంగా ఘట్టమనేని మరియు దగ్గుబాటి కుటుంబాల నుండి కూడా హీరోలు వచ్చారు.అయితే ఇలా వారసుల సినిమా ఎంట్రీ వెనుక ఒక ఆసక్తికర్తమైన కథ ఉందని తెలుస్తోంది.

దీనిని ఎవరు స్టార్ట్ చేశారు అన్నది కూడా చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు.అయితే దీని వెనుక ఉన్నది మాత్రం అలనాటి నటుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని తెలుస్తోంది.

అందరి కన్నా ముందు ఎన్టీఆర్ తన బిడ్డలను సినిమా రంగానికి పరిచయం చేశాడు.ఇతని తరువాత మిగిలిన కుటుంబాలు కూడా తమ వారసులను సినిమా రంగానికి తీసుకురావడం స్టార్ట్ చేశారు.

అయితే ఈ ఎన్టీఆర్ కాలంలో ఉన్న నటీనటులు అయిన ఎస్వీరంగారావు, భానుమ‌తి, రాజ‌నాల, రేలంగి వెంకట్రామ‌య్య లు ఎవరూ కూడా తమ వారసులను ఇండస్ట్రీకి నటులుగా పరిచయం చేయడానికి సాహసం చేయలేదు.


Telugu Akkineni Heroes, Balakrishna, Daggubati, Ghatttamaneni, Harikrishna, Mahe

అయితే అందరూ అనుకున్నట్లు సినిమా రంగంలో సక్సెస్ అవ్వాలంటే… బ్యాక్ గ్రౌండ్ ఉంటే మాత్రం సరిపోదని వారిలో టాలెంట్ ఉంటేనే ఇక్కడ నెట్టుకురావడం సాధ్యం అవుతుందని తెలుసుకుని ఎవ్వరూ ముందుకు రాలేకపోయారు.అయితే వీరందరికన్నా కూడా ఎన్టీఆర్ మాత్రం డిఫరెంట్ అని చెప్పాలి.తన మాటపై ఎక్కువగా ప్రజల్లో నమ్మకం కలిగింది అందుకే తాను వారసులను రంగంలోకి దింపారు.

అలా వచ్చిన వారే ఎన్టీఆర్ కొడుకులు హరికృష్ణ మరియు బాలకృష్ణ లు… అయితే హరికృష్ణ అంతగా సక్సెస్ కాలేకపోయారు.కేవలం కొన్ని సినిమాలు మాత్రమే చేసి పక్కకు తప్పుకున్నారు.

ఇక బాలయ్య గురించి చెప్పేది ఏమీ లేదు.ఈ వయసులోనూ కుర్ర అహీరోలకు ధీటుగా నటిస్తూ దూసుకుపోతున్నాడు.

ఆ తర్వాత మరి ఇద్దరినీ కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకువచ్చారు.కానీ వీరిని నిర్మాణ రంగంలోనే ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు.

అయితే అప్పట్లో ఈ విషయంపై ఎందరో ఎన్టీఆర్ పట్ల విమర్శలు చేశారు.


Telugu Akkineni Heroes, Balakrishna, Daggubati, Ghatttamaneni, Harikrishna, Mahe

ఆ తర్వాత అక్కినేని హీరో నాగేశ్వరరావు సక్సెస్ అయ్యాక… తన నటవారసుడు నాగార్జునను సినిమా హీరోగా చేశాడు .కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం నాగార్జునను హీరోగా పరిచయం చేయాలనీ అనుకోలేదట.ఇతనిని వ్యాపార రంగం వైపు దించడానికి ఇంజనీరింగ్ కూడా చేయించాడు నాగేశ్వరరావు.

కానీ నాగార్జునకు సినిమాలు అన్నా ఇష్టం ఏర్పడడంతో ఇక కాదనలేక ఓకే చెప్పారట.అప్పటికే ఎన్టీఆర్ కుమారులు సక్సెస్ అవ్వడం చూసే ఈ నిర్ణయం తీసుకున్నారు నాగేశ్వరరావు.

అయితే ఇలా వరుసగా సినిమా హీరోల వారసులు సక్సెస్ అవ్వడం చూసిన నిర్మాతలు సైతం ఇదే సూత్రాన్ని పాటించారు.అందులో ముఖ్యంగా నాగేశ్వరరావు కు ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన జగపతి పిక్చర్స్ అధినేత రాజేంద్ర ప్ర‌సాద్ తనయుడు జగపతిబాబు కూడా హీరోగా వచ్చి తానేమిటో నిరూపించుకున్నాడు.


Telugu Akkineni Heroes, Balakrishna, Daggubati, Ghatttamaneni, Harikrishna, Mahe

ఈయన తర్వాత ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ‌ కూడా తన ఇద్దరు కొడుకులను సినిమా రంగం వైపు దింపారు.అయితే అనుకోకుండా వారిలో ఒకరు మాత్రమే హిట్ అయ్యి… ఇంకొకరు ఫెయిల్ అయ్యారు.అయితే కృష్ణ మాత్రం ర‌మేష్‌బాబు ను ఎలాగైనా పెద్ద హీరోగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసారు.కానీ ఎందుకో అవన్నీ వర్క్ అవుట్ కాలేదు.ఆ తర్వాత ఒకటి రెండు సీనిమాలకు రమేష్ బాబు పూర్తిగా దూరం అయ్యాడు.కానీ కృష్ణ చిన్న కొడుకు మహేష్ బాబు మాత్రం ఇప్పటికీ అంచనాలకు అందకుండా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు.

ఇలా తమ వారసులను ఇండస్ట్రీకి తెచ్చినా కొందరు మాత్రం సక్సెస్ అయ్యారు.అయితే ఇలా వారసులు సినిమా పరిశ్రమపై దండయాత్ర చేయడంతో ఎంతో మంది టాలెంట్ ఉన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగానే మిగిలిపోయారు.

అలా ఎన్టీఆర్ పరోక్షముగా సినిమా పరిశ్రమలో వారసత్వం పెరగడానికి కారణం అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube