బిహార్( Bihar ) రాష్ట్రంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగు చూసింది.ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ తన ఉద్యోగాన్ని దుర్వినియోగం చేశారు.
ఆయన స్కూల్‌లో రీల్స్ చేస్తూ తన, విద్యార్థుల విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు.ఆ హెడ్‌మాస్టర్ పేరు బుద్ధ ప్రకాష్.
ఈయన సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు.ఆయన భోజపురి, మగహీ భాషల పాటలకు డాన్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు.
ఈ వీడియోలను ఆయన తరగతి గదిలోనే చిత్రీకరిస్తున్నారు.ఆయన విద్యార్థులను కెమెరా మెన్‌గా వాడుకుంటున్నారు.

ఈ విషయం గురించి ప్రజలు చాలా చర్చించుకుంటున్నారు.కొంతమంది ఈ వీడియోలు చదువుకునే సమయాన్ని వృథా చేస్తున్నాయని అంటున్నారు.చాలా మీడియా వార్తల్లో చెప్పిన విషయం ఏంటంటే, ఆ హెడ్‌మాస్టర్ తన ఉపాధ్యాయ బాధ్యతలపై దృష్టి పెట్టకుండా తన తరగతి గదిని, పాఠశాలలో చదువుకునే విద్యార్థులను వాడుకుని వీడియోలు చేసి ఫేమస్ కావాలని చూస్తున్నారు.ఈ వీడియోల్లో కొన్ని అసభ్యకరమైన పాటలు కూడా ఉన్నాయి.
ఈ వీడియోలు చాలా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఒక విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ, ఈ వీడియోలు వైరల్ అయితే తమకు పేరు, డబ్బు వస్తుందని హెడ్‌మాస్టర్ వాగ్దానం చేసి ఈ వీడియోలు చేయమని బలవంతం చేశారని తెలిపాడు.ఆ హెడ్‌మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ వీడియోలు చేస్తే డబ్బు వస్తుంది, ఫేమస్ అవుతాను అని అనుకున్నానని, ఇంత పెద్ద విషయం అవుతుందని తెలియదని చెప్పారు.తన తప్పును ఒప్పుకుంటూ, ఇకపై ఇలాంటి పనులు చేయనని కూడా చెప్పారు.
ఈ విషయం గురించి జిల్లా విద్యా అధికారి రాజేష్ కుమార్( Rajesh Kumar ) వెంటనే చర్యలు తీసుకున్నారు.ఈ విషయాన్ని విచారించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
హెడ్‌మాస్టర్ తప్పు చేశారని నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కుమార్ హెచ్చరించారు.







