మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలా..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే వారు నిర్మించుకునే ఇల్లు, ఇల్లలో ఉంచుకునే వస్తువులు అన్నీ కూడా వాస్తు ప్రకారమే అమర్చుకుంటూ ఉంటారు.

 Bring Happiness Into Your New Home With These Vastu Tips,vastu Tips,home Vastu T-TeluguStop.com

ఇలా చేయడం వల్ల ప్రతి వ్యక్తి ఇల్లు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఇంట్లోని వస్తువులు, ఇల్లు కూడా వాస్తు ప్రకారమే ఉండాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు.జీవితంలో సంతోషం అంటే మనిషికి ఆరోగ్యకరమైన శరీరం ఉండడమే అని పెద్దవారు చెబుతూ ఉంటారు.

అయితే మారుతున్న కాలంతో పాటు మారిన జీవన విధానంలో మనిషి ఆరోగ్యం పై తీవ్ర చెడు ప్రభావం పడుతూ ఉంది.ఇప్పటి కాలంలో దాదాపు ప్రతి వ్యక్తి పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు.

అటువంటి పరిస్థితులలో సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవితం అనేది వారికి అస్సలు ఉండడం లేదు.మెరుగైన రోజువారి జీవనంతో పాటు మీ ఇల్లు సరైన వాస్తు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా ఈ వాస్తు నియమాలను పాటించాలని చెబుతున్నారు.

Telugu Astrology, Bed Vastu, Happiness, Vastu Tips, Energy, Pooja-Latest News -

వాస్తు ప్రకారం ఎప్పుడూ తూర్పు దిశలో పడుకోవడం ఆరోగ్యానికి హానికరం అనే చెప్పాలి.ఉత్తర దిశలో తలపెట్టి నిద్రించే వారిని ప్రతికూల శక్తి త్వరగా ఆకర్షిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇలా నిద్రపోవడం వలన తరచుగా వ్యాధితో బాధపడుతూనే ఉండే అవకాశం ఉంది.

ఇంటి రంగు కూడా మంచి ఆరోగ్యానికి కారణం అని చాలామంది నమ్మకం.ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అప్పుడు కూడా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగును వేయడానికి ప్రయత్నించడం మంచిది.

ఎరుపు రంగు సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు.మరోవైపు ఆకుపచ్చ రంగు శాంతిని కూడా ఇస్తుంది.

ఇంకా చెప్పాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూం కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.ఎందుకంటే స్నానం చేసే ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి.

అక్కడ నుంచి ఎలాంటి వాసన రాకుండా ఉండడం మంచిది.బాత్రూంలో ఏదైనా కుళాయి నుంచి నీరు లీక్ అవుతూ ఉంటే వెంటనే దాన్ని రిపేర్ చేయించడం మంచిది.

ఎందుకంటే ఇలా ఉంటే ప్రతికూల శక్తిని త్వరగా ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు.

Telugu Astrology, Bed Vastu, Happiness, Vastu Tips, Energy, Pooja-Latest News -

వాస్తు శాస్త్రం ప్రకారం మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే ఇంటికి తూర్పు ఈశాన్య దిశల వైపు సరిహద్దు గోడను ఎప్పుడు తక్కువ ఎత్తులో నిర్మించుకోవడం మంచిది.ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యకిరణాలు ఆ వైపు నుంచే వస్తాయి.ఇంట్లోని పూజ స్థలం అత్యంత ప్రశాంతమైన పవిత్రమైన ప్రదేశంగా ఉండాలని చాలామంది ప్రజలు భావిస్తారు.

పూజ గదిలో పగిలిపోయిన విగ్రహాన్ని ఎప్పటికీ ఉంచకూడదు.ఉదయం పూజ చేసేటప్పుడు ధూప దీపాలను వెలిగించాలి.

ఇది మీ మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఒత్తిడి కూడా దూరం అవుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube