తెల్ల జుట్టు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో వేధించే సమస్య ఇది.
వయసు పైబడే కొద్ది జట్టు తెల్ల పడటం కామనే.కానీ, నేటి ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, కాలుష్యం, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలు వాడకం, పోషకాల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల యుక్త వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.
ఈ క్రమంలోనే తెల్ల జుట్టును ఎలా నివారించుకోవాలో తెలియక నానా తిప్పలు పడుతుంటారు.
కానీ అందరి ఇళ్లల్లో ఉండే ఆలు గడ్డ (బంగాళదుంప)తోనే తెల్ల జుట్టుకు సులువుగా చెక్ పెట్టవచ్చు.
మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కొన్ని బంగాళదుంప ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.
ఈ రసాన్ని తలకు, కేశాలకు బాగా పట్టించి.అర గంట పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేసేయాలి.ఇలా వారంలో మూడు సార్లు చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
అలాగే ఆలు గడ్డలను నీటుగా శుభ్రంగా చేసుకుని పై తొక్కలు తీయాలి.ఇప్పుడు ఆ తొక్కలను నీటిలో వేసి ఉడకబెట్టి.
ఆతర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి.ఆ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు మరియు ఎగ్ వైట్ వేసి కలిపి తలకు బాగా అప్లై చేసుకోవాలి.
అర గంట నుంచి గంట పాటు వదిలేసి.అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో హెడ్ బాత్ చేయాలి.
ఇలా తరచూ చేసినా జుట్టు నల్లబడుతుంది.
ఇక ఆలు గడ్డలను మిక్సీ పట్టుకుని రసం తీసుకోవాలి.ఆ రసంలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి.తలకు, కుదుళ్లకు, జుట్టుకు పూసుకోవాలి.
ఇరవై లేదా ముప్పై నిమిషాల అయిన తర్వాత తల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.