హీరోయిన్స్ చాలా కష్టపడి సినిమా ఇండస్ట్రీలో ముందుకు వెళుతూ ఉంటారు.ఒక్కోసారి అవకాశాలు వచ్చిన సినిమాలు విజయవంతం సాధించకపోవడంతో వారిని ఐరన్ లెగ్గులుగా ముద్ర వేస్తూ సినిమాలకు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు.
అంతటి స్ట్రగుల్ ఫేస్ చేసే హీరోయిన్స్ లో కొంతమంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ కూడా ఉంటారు.వాళ్ళ హార్డ్ వర్క్ తోనే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు.
అలాగే అవకాశాలతో పాటు అదృష్టం కూడా ఉన్నవారే విజయవంతం కూడా అవుతారు.ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై ( Heroines ) చాలా మందికి చులకన భావం ఉంటుంది.
ఈ హీరోయిన్ కాకపోతే ఇంకో హీరోయిన్ అన్న చందంగా అందరూ ప్రవర్తిస్తూ ఉంటారు.పైగా ఆమెను ఒక గ్లామర్ డాల్ గా చూడటానికి ఇష్టపడతారు.

కానీ ఒక ఇద్దరు హీరోయిన్స్ మాత్రం అలా గ్లామర్ డాల్స్ గా కాకుండా చూడగానే దండం పెట్టాలి లేదా కాళ్ళు మొక్కాలి అనేంత పవిత్రంగా కనిపిస్తారట కొంతమందికి.ఇంతకీ ఆ ఇద్దరికి హీరోయిన్స్ ఎవరు ? ఎందుకు అలాంటి ఉన్నత భావాలు వారిని చూడగానే కలుగుతున్నాయి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇక ఆ ఇద్దరు హీరోయిన్స్ మరెవరో కాదు ఒకరు సౌందర్య( Soundarya ) మరొకరు అనుష్క శెట్టి.( Anushka Shetty ) అదేంటి వేళ సంఖ్యలో హీరోయిన్స్ ఉన్న వీరిద్దరూ మాత్రమే ఎందుకు అంత స్పెషల్ అనుకుంటున్నారా ? కొంతమంది మాటల్లో వారి గురించి పబ్లిక్ మీటింగ్స్ లలో చెబుతూ ఉంటారు.సౌందర్య గురించి చెప్పాల్సి వస్తే ఆమె మనసు వెన్న లాంటిదట.ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తుందట.
రెస్పెక్ట్ తో కూడిన సంభాషణ చేస్తుండట.ఆమెతో మాట్లాడడానికి ఎవరైనా కూడా ఇష్టపడతారట.

అంత మంచి హీరోయిన్ మళ్ళీ పుట్టదు పుట్టలేదు అనే చాలా మంది ఇంటర్వ్యూస్ లో సౌందర్య గురించి చెప్పారు.మరొక హీరోయిన్ అనుష్క విషయానికొస్తే చాలా సెన్సిటివ్ గా ఉండి ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడుతుందట.పైగా అవతలి వారికి మర్యాద ఇవ్వడంలో అనుష్క తర్వాతే ఎవరైనా.ఆమెని చూస్తే కాళ్లకు దండం పెట్టాలని అనిపిస్తుంది అంటూ పూరి జగన్నాథ్( Puri Jagannadh ) ఓసారి స్టేజిపై చెప్పడం అందరికీ తెలిసిందే.
ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపించేంత హుందాగా ప్రవర్తించడం ఈ ఇద్దరు హీరోయిన్స్ కి మాత్రమే చెల్లింది.ఇంతకన్నా గొప్ప హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో ఉండొచ్చు కానీ వీరికి మాత్రమే ఆ గౌరవం దక్కడం విశేషం.







