ప్రముఖ దర్శకులలో ఒకరైన బండి సరోజ్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను మీర్జాపూర్ చూడలేదని కొన్ని పాత్రలు కొన్ని విధాలుగా మాట్లాడితేనే బాగుంటుందని ఆయన అన్నారు.
ఇంటర్నెట్ అంటే సెల్ఫ్ చెక్ అని ఆయన తెలిపారు.తాను తటస్థుడినని ఎవరికీ భయపడనని బండి సరోజ్ కుమార్ వెల్లడించారు.
పాన్ ఇండియా అంటే ఇండియా మొత్తం కనెక్ట్ కావడం అని అలా చేయాలంటే దేశం మొత్తానికి సంబంధించిన కథతో వెళ్లాలని ఆయన తెలిపారు.కథ కనెక్ట్ అయ్యే సినిమా పాన్ ఇండియా సినిమా తప్ప 300 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఆ సినిమా పాన్ ఇండియా అవదని బండి సరోజ్ కుమార్ అన్నారు.
పాన్ ఇండియా సినిమాకు డబ్బుతో సంబంధం లేదని బండి సరోజ్ కుమార్ చెప్పుకొచ్చారు.

కంటెంట్ బట్టి పాన్ ఇండియా సినిమా అనేది ఉంటుందని బండి సరోజ్ కుమార్ పేర్కొన్నారు. బాహుబలి ఏ లాంగ్వేజ్ లో అయినా వర్కౌట్ అవుతుందని బాహుబలి సర్కస్ లాంటిదని ఆ సినిమా ఎగ్జిబిషన్ లా మన కల్చర్ కు దగ్గరగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.కంటెంట్ వల్ల సినిమా పాన్ ఇండియా సినిమా అవుతుందని బండి సరోజ్ కుమార్ అన్నారు.
బండి సరోజ్ కుమార్ చేసిన కామెంట్లు నిజమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినా బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకోవడం లేదు.బడ్జెట్ కంటే కథ, కథనాలకే ప్రేక్షకులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ మధ్య కాలంలో కొన్ని చిన్న సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలవడం గమనార్హం.







