కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా క్షణం తీరికే లేకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ( Telangana assembly election )పోటీ చేస్తున్న అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు.ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
అర్ధరాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మళ్లీ ఉదయం సూర్యోదయం కాకముందే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు.ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతూ ఉండడంతో , పనులకు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ , వారిని ప్రసన్నం చేసుకునే పనుల్లో ఉన్నారు.
అభ్యర్థులతో పాటు , భారీ అనుచర గణం కూడా అంతే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు అసలు 24 గంటల సమయం కూడా సరిపోవడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు.ఎన్నికల ప్రచార సమయంలో ఈ విధంగా కష్టపడి విజయం సాధిస్తే రాబోయే ఐదేళ్లు తమకు ఉండదని, అదృష్టం కలిసి వస్తే మంత్రి పదవి కూడా దక్కుతుంది అనే లెక్కల్లో అభ్యర్థులు ఈ విధంగా కష్టపడుతున్నారు.

ఒక్క నిమిషం వృధా కాకుండా తమ ఎన్నికల షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.నిద్రపోయే సమయం తప్ప మిగతాది అంతా ఎన్నికల ప్రచారం కోసం కేటాయిస్తున్నారు.ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్లీ పడుకునే వరకు వేలాదిమందిని ప్రత్యక్షంగా కలిసి తమను గెలిపించాలని అభ్యర్థిస్తూ వస్తున్నారు .అంతే కాకుండా తాము పోటీ చేయబోయే పార్టీ,( Party ) ప్రాముఖ్యత, గుర్తు గురించి వివరిస్తూనే తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తామో వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఎక్కడిక క్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు.ఇక అభ్యర్థుల తో నిత్యం జనాల సందడి కనిపిస్తుంది.ప్రతిరోజు ఉదయం నుంచి నాయకులు కార్యకర్తలు అభ్యర్థులతో మాట్లాడేందుకు క్యూ కట్టేస్తున్నారు.నియోజకవర్గమంతా కలియ తిరుగుతూ కొన్నిచోట్ల తమ ప్రధాన అనుచరులను ప్రచారానికి పంపుతూ, ఫలితం తమకు అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.







