సాధారణంగా చిన్నపిల్లల్లో ఎలాంటి కల్మషం ఉండదు అంటారు.ఇది మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది.
జంతువులు లేదా మనుషులకు తమ చిన్నతనంలో ప్రేమ తప్ప క్రూరత్వం, ద్వేషం అంటే ఏంటో కూడా తెలియవు.వారు ప్రతి దానితో ప్రేమను పంచుకుంటారు.
ఈ విషయాన్ని ఒక చిన్న పిల్లోడు మరోసారి నిరూపించాడు.దీనికి సంబంధించిన వీడియోని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోని బీవైరల్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 3.5 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఇంచుమించు రెండేళ్ల వయసున్న ఓ కుర్రాడు తన ఫ్యామిలీతో కలిసి ఒక జూపార్క్‌లో ఎంజాయ్ చేయడం చూడొచ్చు.
ఆ క్రమంలోనే ఒక జింక పిల్ల భయం, బెరుకు లేకుండా ఆ బుడ్డోడి ముందుకు వచ్చి నిలబడింది.దానిని చూడగానే ఆ చిన్నోడు చాలా ముచ్చట పడ్డాడు.
అనంతరం ఆ మూగ జీవికి ముద్దులు పెడుతూ ప్రేమను పంచాడు.మొదట ఆ జింక అలాగే నిల్చొని ముద్దు పెట్టించుకుంది.
ఆ తర్వాత ఆ చిన్నోడు దాని ముఖాన్ని ఎత్తి మరీ చక్కటి ముద్దు పెట్టాడు.ఈ సమయం అంతా కూడా జింక అతడి నుంచి దూరంగా పారిపోకుండా అక్కడే నిల్చోని ఉంది.

ఈ దృశ్యాలను చూసిన బుడ్డోడి తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న సందర్శకులందరూ ఆశ్చర్యపోయారు.తల్లిదండ్రులు ఈ దృశ్యాలను తమ ఫోన్ కెమెరాలో బంధించారు.ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అందరూ సో క్యూట్ అంటూ మురిసిపోతున్నారు.చిన్నపిల్లలు మూగ జంతువుల పట్ల ఇలాగే ప్రేమను కురిపిస్తారని ఒక యూజర్ కామెంట్ చేశారు.
చిన్నపిల్లోడు తనకు హాని చేయడని ఆ జింకకి కూడా తెలుసేమో అని ఇంకొక యూజర్ కామెంట్ చేశారు.ఈ వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయండి.







