సాధారణంగా కుక్కలు తమ యజమానులను తల్లిదండ్రులుగా భావిస్తాయి.వారు ఇంటిని వదిలేసి ఎక్కడికైనా వెళ్తే మళ్లీ తిరిగి వచ్చేంతవరకు వేచి చూస్తూనే ఉంటాయి.
యజమానులు మళ్లీ ఇంటికి రావటం చూడగానే ఇవి ఎంతో సంతోష పడతాయి.చిన్నపిల్లలు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చి తమ తల్లిదండ్రులను కౌగిలించుకుంటారో అలా ఈ కుక్కలు కూడా తమ యజమానుల వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి.
ఇవి నాలుకతో నాకుతూ తమ నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తాయి.అయితే తాజాగా ఒక కుక్క మాత్రం భలే క్యూట్ గా తన లవ్వును ఎక్స్‌ప్రెస్ చేసి అందరి హృదయాలను దోచేస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో ని shaq_thebuldog అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేసింది.ఈ వీడియోపై లైకుల వర్షం కురుస్తోంది.ఇప్పటికే దీనికి 14 లక్షలకు పైగా లైకులు రాగా కోట్ల కొద్దీ వ్యూస్, వేల కామెంట్లు వచ్చాయి.
ఈ వీడియోలో యజమాని డోర్లు తీసుకొని ఇంట్లోకి రావడం చూడొచ్చు.
దాంతో అతని కోసం ఎంతోసేపు వేచి చూసిన ఒక కుక్కపిల్ల ఎంతో సంతోషపడింది.అనంతరం అది భలే వింతగా నడుస్తూ ప్రేమ కురిపిస్తూ తన యజమాని వద్దకు వచ్చింది.
దీని నడక ఫ్యాషన్ షోలో మోడల్స్ నడిచినట్లు అనిపించింది.ఇది చూసిన నెటిజన్లు వావ్, వాట్ ఏ వండర్‌ఫుల్ ఫ్యాషన్ వాక్ అని కామెంట్లు పెడుతున్నారు.
ఇది క్యాట్ వాక్ చేస్తూ మురిసిపోతూ నడిచిన తీరుకు తాము మంత్రముగ్ధులయ్యామని ఇంకొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.చాలామంది మాత్రం దీని నడక చూసి తెగ నవ్వేస్తున్నారు.
దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.







