'భోళా శంకర్' క్లోసింగ్ కలెక్షన్స్.. కనీసం 'ఇంద్ర' కలెక్షన్స్ కూడా దాటలేదా!

ఈ ఏడాది ప్రారంభం లో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )’వాల్తేరు వీరయ్య( Waltair Veerayya )’ సినిమాతో అభిమానుల్లో ఏ రేంజ్ జోష్ ని నింపాడో, ద్వితీయార్థం లో ‘భోళా శంకర్‘ సినిమాతో అంతకు పదింతలు నిరాశ ని నింపాడు.మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ తమిళ సినిమా రీమేక్ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.

 'bhola Shankar' Closing Collections At Least 'indra' Collections Have Not Cross-TeluguStop.com

ఫలితంగా చిరంజీవి తన 40 ఏళ్ళ కెరీర్ లో ఎప్పుడూ చూడని ఘోరమైన పరాభవాలు మొత్తం ఈ సినిమా ద్వారా చూడాల్సి వచ్చింది.ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు దశాబ్దాల క్రితం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఇంద్ర’( Indra ) కంటే తక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.

ఇది నేటి తరం స్టార్ హీరోలకు మొదటి రోజు వసూళ్లతో సమానం.

Telugu Bhola Shankar, Chiranjeevi, Indra, Keerthy Suresh, Ravi Teja, Tamannaah,

చిరంజీవి గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య‘ మొదటి రోజు వసూళ్లు కూడా చిరంజీవి ‘ఇంద్ర’ ఫుల్ రన్ వసూళ్లకంటే ఎక్కువే.అలాంటిది ‘భోళా శంకర్’ ( Bhola Shankar )చిత్రం ఫుల్ రన్ వసూళ్లు, రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఇంద్ర కంటే తక్కువ వచ్చాయని ట్రేడ్ పండితులు అంటున్నారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.మూడు రోజులు షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , నాల్గవ రోజు నుండి ప్రతీ ప్రాంతం డెఫిసిట్ ని ఎదురుకుంది.

ఒక్కసారి ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను చూస్తే, నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.మెగాస్టార్ గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య ‘ మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.

ఇక ఆ తర్వాత సీడెడ్ లో 3 కోట్ల 31 లక్షలు, అలాగే ఉత్తరాంధ్ర లో 3 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Indra, Keerthy Suresh, Ravi Teja, Tamannaah,

అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల 23 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 2 కోట్ల 67 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో కోటి 72 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో కోటి 23 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది,మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా ప్రాంతాల్లో 23 కోట్ల 40 లక్షల రూపాయిలు, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 27 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.ఇది ‘వాల్తేరు వీరయ్య’ మొదటి రోజు వసూళ్ల కంటే మూడు కోట్ల రూపాయిలు తక్కువ, ఇంత నీచమైన ఫ్లాప్ సినిమాని చిరంజీవి పనిగట్టుకొని చేసిన కూడా మళ్లీ తియ్యలేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube