నీతో బంధాన్ని వివరించడానికి మాటల్లేవ్.. ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ తెలిపిన చరణ్!

రామ్ చరణ్ ఎన్టీఆర్ వీరిద్దరి మధ్య ఎంత మంచి స్నేహబంధం ఉందో మనకు తెలిసిందే.వీరిద్దరు కలిసి RRR సినిమాలో నటించక ముందే వీరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ వెల్లడించారు.

 Ram Charan Emotional Wishes To The Jr Ntr Birthday ,  Jr Ntr, Tollywood, Ram Cha-TeluguStop.com

ఇక ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించడంతో వీరి మధ్య ఉన్న స్నేహ బంధం మరింత బలపడిందని చెప్పాలి.ఇకపోతే నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు పెద్దఎత్తున ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే తారక్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ స్పందిస్తూ.సోదరుడు, కోస్టార్..స్నేహితుడు నీతో ఉన్న బంధాన్ని వివరించడానికి మాటల్లేవ్… మన మధ్య ఉన్న ఈ బంధాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను హ్యాపీ బర్త్ డే తారక్ అంటూ రామ్ చరణ్ ఎన్టీఆర్ ను ఎంతో ఎమోషనల్ గా హగ్ చేసుకున్న ఫోటోని షేర్ చేస్తూ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే వీరిద్దరూ ఎంతో మంచి స్నేహితులని చరణ్ పుట్టిన రోజును అర్ధరాత్రి 12 గంటల నుంచి తనతో పాటు కలిసి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అంటూ ఇది వరకే రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకల గురించి ఎన్టీఆర్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ప్రతి సంవత్సరం వీరిద్దరూ పుట్టినరోజు సందర్భంగా ఒకరికొకరు ఎంతో ప్రేమగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియ చేసుకుంటూ వారి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని బయట పెడుతున్నారు.ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో బిజీకాగా రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube