గత కొద్దిరోజులుగా కేంద్ర అధికార పార్టీ బీజేపీ( BJP ) పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ , కేంద్ర ప్రభుత్వ విధానాలపై తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు మంత్రి కేటీఆర్( Minister KTR ).దేశవ్యాప్తంగా బీఆర్ఎస్( BRS ) ను విస్తరిస్తున్న నేపథ్యంలో బీజేపీ ని టార్గెట్ చేసుకుంటున్నారు.
అలాగే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం, బీజేపీ స్పీడ్ పెంచుతున్న క్రమంలో కేటీఆర్ మరింత గా బీజేపీ పై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ కేంద్రం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు.ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్ముకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు.ఆ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలనేదే తమ తాపత్రయం అని కేటీఆర్ అన్నారు.
” ప్రభుత్వ రంగ సంస్థలు బతికితేనే ప్రజలకు న్యాయం. బండి సంజయ్( Bandi Sanjay ) కు విషయ పరిజ్ఞానం లేదు.అయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు ‘” అంటూ సంజయ్ పై విమర్శలు చేశారు.” తెలుగు రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ స్థాపిస్తామని విభజన చట్టం లో ఉంది.బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిసారీ ప్రశ్నిస్తున్నాం.

సీఎం కేసీఆర్ అనేకసార్లు కేంద్రానికి లేఖ రాశారు.ప్రధాని స్వయంగా కలిసి బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు .బయ్యారం స్టీల్ ప్లాంట్ పై కుట్రలు చేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు, నిధులు ఇవ్వకపోవడం తోనే నష్టాలు.విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లోకి నెట్టి అమ్మడానికి చూస్తున్నారు.” అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు.విశాఖ పొట్ట కొడుతోంది ప్రధాని మోది నే .బయ్యారం విషయంలో కూడా ఇదే జరుగుతుంది.నేను చెప్పింది తప్పయితే పరువు నష్టం దావా వేయండి అంటూ కేటీఆర్ అన్నారు .







