అదిరిపోయే గూగుల్ మ్యాప్స్ ఫీచర్స్ గురించి తెలుసుకొని, ఇకపై మీ డబ్బుని సేవ్ చేసుకోండిలా!

ఇపుడు మీ స్మార్ట్ ఫోన్ లో వున్న గూగుల్ మ్యాప్స్‌ని వుపయోగించి, మీ దగ్గర వున్న డబ్బులని సేవ్ చేయొచ్చు తెలుసా? అవును.త్వరలోనే గూగుల్ మ్యాప్స్‌ కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

 Save Money With These New Features Of Google Maps Details, New Features, Google-TeluguStop.com

రానున్న రోజుల్లో అప్‌డేట్‌ ద్వారా అందరికీ ఈ నూతన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.వీటివలన ఉపయోగాలు విషయానికొస్తే, ప్రయాణించే రోడ్‌పై ఎన్ని టోల్ గేట్స్ ఉంటుంటాయి, గమ్యానికి చేరేలోపు టోల్ ఫీజు ఎంత అవుతుందనే విషయాన్ని కూడా గూగుల్ మ్యాప్స్ తన కొత్త ఫీచర్లో వాహనదారులకు తెలపనుంది.

ఒకవేళ టోల్ గేట్లు లేని రూట్ కావాలన్నా దాని ప్రకారం ఈ ఫీచర్స్ ద్వారా మనం మన మార్గాన్ని మార్చుకోవచ్చు.

ఇక వీటితో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ సమాచారం కూడా అందించబోతోంది.

అంటే మీరు వెళ్లాలనుకుంటున్న దారిలో ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, ఎక్కడ రష్ ఎక్కువగా ఉంటుంది అనే సమాచారాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.దాని వలన కూడా మనం మన గమ్యం యొక్క రూట్ ని మార్చుకొనే వెసులుబాటు వుంది.

దీనికి మనం చేయవలసిందల్లా ఇదే.ఎక్కడికి వెళ్లాలో మ్యాప్స్‌లో టైప్ చేసి.డైరెక్షన్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ మనకు కనిపిస్తుంది.ఇక టోల్ చార్జీలను చూపించేందుకు ‘See toll pass prices’ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.

Telugu Avoid Tolls, Google Maps, Save, Toll-General-Telugu

ఇక్కడ మీకు ఇంకో డౌట్ వస్తుంది కదా.అక్కడికే వస్తున్నా.ఒకవేళ టోల్స్ లేని దారిలో వెళ్లాలనుకుంటే ఆ దారులను కూడా గూగుల్ మ్యాప్స్ మనకు చూపిస్తుంది.ఇక దీనికోసం టోల్ గేట్లు లేకుండా గమ్య స్థానానికి చేరే మార్గం కావాలనుకున్నవారు ‘Avoid tolls’ ఫీచర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

దీని ద్వారా వాహనదారులు డబ్బు ఆదా చేసుకునే వెసులుబాటు కలదు.ఐడియా సూపర్ కదూ.ఇకపోతే అవాయిడ్ టోల్స్ ఫీచర్ గతం నుంచే మెనూలో ఉన్నా.మరింత కచ్చిత్వంతో చేంజ్ టోల్ సెట్టింగ్స్‌లోనూ పొందుపరుస్తోంది గూగుల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube