నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే.రెండు వారాల క్రితం వచ్చిన సినిమా అప్పుడే అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆగస్టు 12వ తారీకున ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు గా అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.ప్రైమ్ వీడియో లో ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
ఆ మధ్య దిల్ రాజు ఒక సమావేశం లో మాట్లాడుతూ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే డిజిటల్ ప్లాట్ఫారం పై స్ట్రీమింగ్ చేయాలంటూ చెప్పుకొచ్చాడు.
అలా కాదని 3 లేదా 4 వారాలకే సినిమా లను డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంతో కచ్చితంగా థియేటర్ల లో జనాలు చూడటం తగ్గుతారని.
ముందు ముందు ఈ పరిణామం విపత్కర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.కానీ ఇప్పుడు ఆయన నిర్మాతగా వ్యవహరించిన థాంక్యూ సినిమా ను మాత్రం కేవలం నాలుగు వారాల్లోనే ప్రేక్షకుల ముందు కు అమెజాన్ ప్రైమ్ ద్వారా తీసుకు వచ్చేందుకు సిద్ధమవడం విడ్డూరంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ మధ్య వచ్చిన ఎఫ్ 3 సినిమా ను మాత్రం కాస్త ఆలస్యం గానే ఓ టీ టీ కి తీసుకు వచ్చిన దిల్ రాజు ఇప్పుడు ఈ సినిమా ను మాత్రం చాలా స్పీడ్గా ఓ టీ టీ లో తీసుకు వస్తున్నారు.ఈ విషయం లో ఆయ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.ఓ టీ టీ లో త్వరగా విడుదల చేయడం వల్ల నష్టం లో కొంతలో కొంతైనా తగ్గించుకోవాలని దిల్ రాజు భావించి థాంక్యూ ని అప్పుడే ఓ టీ టీ ద్వారా తీసుకొస్తున్నాడు అని అంటున్నారు.







