విజయవాడ: నాలుగో రోజుకి చేరుకున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ.
మహాలక్ష్మి అలంకారం లో ఉదయం 3 గంటల నుంచి దర్శన భాగ్యం.అష్టలక్ష్మిల్లో ఒకరైన మహాలక్ష్మిని దర్శనం చేసుకునేందుకు భక్తులు మిక్కిలిగా ఇష్టపడతారు.
ఇంద్రకీలాద్రి పై శోభాయమానంగా జరుగుతున్న శరన్నవరాత్రులలో దుర్గాదేవి కి చేసే మహాలక్ష్మి అలంకారం కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.మంగళ ప్రదమైన దేవత మహాలక్ష్మి.
దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవి ఆదిపరాశక్తి మహాకాళి.మహాలక్ష్మీ, మహా సరస్వతి అనే రూపాల్ని ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేసారు.
మూడు శక్తుల్లో ఒక శక్తైన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసున్ని సంహరించింది.లోక స్థితి కారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృత స్వరూపిణిగా దుర్గమ్మ మహాలక్ష్మీదేవి గా దర్శనమిస్తారు.
మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు ఐశ్వర్య ప్రాప్తి , విజయం సిధ్దిస్తుందని ప్రతీతి.మహాలక్ష్మి నమోస్తుతే అనే నామము ప్రాధాన్యమైనది.