తెలుగుదేశం పార్టీని ముప్పతిప్పలు పెట్టే అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కొడాల నాని( Kodali Nani ) ఒకరు .జగన్ సమర్థించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడిన కొడాలి నాని పట్ల జగన్ కూడా చాలా అభిమానం ప్రదర్శిస్తుంటారు .
జగన్ పై విమర్శలు చేసే వారి కి రిటార్ట్ ఇవ్వడంలో కొడాలి నాని తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు.మాస్ లీడర్ ఇమేజ్ కలిగిన కొడాలి నాని ఇప్పటికే నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికై గుడివాడ నియోజకవర్గం లో తిరుగులేని నేతగా మారారు ఆయనను ఓడించడానికి ఇప్పటికే పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ నియోజకవర్గంలో క్రింది స్థాయి నేతలతో ,కార్యకర్తలతోనూ బలమైన సంబంధాలు మెయింటైన్ చేసే గుడివాడ నాని నాలుగు పర్యాయాలు తన విజయ యాత్రను కొనసాగించగలిగారు.

అయితే నిత్యం తమను విమర్శిస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తూ కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని పట్టుదలతో ఉంది టిడిపి అధిష్టానం.అయితే ఇంతవరకు టిడిపికి సరైన అభ్యర్థి మాత్రం దొరకలేదు, అయితే ఇప్పుడు కొడాలి నాని ని ఓడించడానికి కొత్త స్కెచ్ గీసినట్లుగా తెలుస్తుంది .సినీరంగం నుండి ప్రత్యక్ష రాజకీయాలలో దిగడానికి ఆసక్తి చూపించిన తారకరత్న అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు అకాల మరణం చెందడంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డిని కొడాలి నాని పై పోటీ చేయించాలని చూస్తుందట తెలుగుదేశం అధిష్టానం.

మహిళ కావటం,తారకరత్న మరణంతో ఏర్పడిన సానుభూతి కూడా కలిసి వస్తుందని తెలుగుదేశం పార్టీ లెక్కలు కడుతున్నట్లుగా తెలుస్తుంది.అయితే నాలుగు సార్లు గెలుపుతో నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలిచే అంత చనువు తెచ్చుకున్న కొడాలి నానిని నియోజకవర్గంలో పాతుకుపోయారని చెప్పవచ్చు .

అలాంటి వ్యక్తి పై రాజకీయాలకు కొత్తయిన అలేఖ్య రెడ్డి( Alekhya Reddy ) గెలవ గలదా అని అనుమానాలు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరగటం కొడాలి నాని వ్యవహార శైలి కూడా బాగా వివాదాస్పదం కావడంతో స్వంత సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకత తెచ్చుకోవడంతో ఈసారి కొడాలి నానిని ఓడించడం సాధ్యమే అని చంద్రబాబు( Chandrababu Naidu ) విశ్వసిస్తున్నారని సమాచారం.మహిళా అన్న అడ్వాంటేజ్ తారకరత్న మరణంతో ఏర్పడిన సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత ఈ మూడు కలిసి వస్తే గుడివాడలో టిడిపి జెండా ఎగరేయడం ఏమంత కష్టం కాదని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నదటమరి ఆ పార్టీ అంచనాలు ఏ మార్కు నిజమవుతాయో చూడాలి
.






