కరోనా మహమ్మారి తర్వాత దేశంలో పెనుమార్పులు సంభవించాయి.ఈ క్రమంలో భారతీయులు సెల్‌ఫోన్లకు అందులోనూ కొన్ని రకాల యాప్‌లకు అడిక్ట్ అవుతున్నారు అని సర్వేలు చెబుతున్నాయి.
అయినా సర్వేలు చెప్పడం ఏమిటి? మనకి కూడా తెలుసు కదా.మనం కూడా మితిమీరి యాప్స్ వాడకంలో మునిగిపోతున్నాం అనేది సత్యం.ఈ విషయమై జరిగిన తాజా సర్వేలో ఫుడ్ కోసం ఆన్‌లైన్‌లో( Online food Order ) ఆర్డర్ పెట్టడం దగ్గర నుంచి అద్దె ఇళ్ల కోసం, ఇళ్ల కొనుగోలు కోసం మరియు డ్రెస్‌ల సెలక్షన్ కోసం యాప్‌లను అధికంగా వాడినట్టు బయటపడింది.

కరోనా లాక్‌డౌన్‌ల తరువాత ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పటికీ జనం ఎక్కువ శాతం కీలకమైన కన్జ్యూమర్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లపైనే ఆధారపడడం కొసమెరుపు.నిత్యావసర సరుకులు.చివరికి ఉద్యోగాల కోసం కూడా యాప్‌ల మీదే ఆధారపడుతున్న పరిస్థితి.
వివిధ సంస్థలు నియామకాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించినప్పటికీ ఉద్యోగార్థులు జాబ్ పోర్టల్స్‌ని సందర్శిస్తూనే ఉన్నారు.మరోవైపు.
బ్యూటీ యాప్‌లను ఓపెన్ చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతుండడం గమనార్హం.

ఇక.ఐపీఎల్ మ్యాచ్‌ల వంటివి ఉండనే వున్నాయి.అదేవిధంగా అద్దె ఇళ్లు( Rent house ) మరియు ఇళ్ల కొనుగోలు కోసం వెతికేవారు కూడా ఆన్‌లైన్‌ని బేస్ చేసుకుంటూ ఉండటంతో హయ్యస్ట్ ట్రాఫిక్ అక్కడ నడుస్తోంది.
కొవిడ్ నేపథ్యంలో భౌతిక దూరాలు పెరిగినందున ఫ్యాషన్ దుస్తులకు గిరాకీ బాగా ఏర్పడింది.దీంతో కస్టమర్లు యాప్ బేస్డ్ బుకింగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మొదలు పెట్టారు.

ఫలితంగా. ఆన్‌లైన్ సేల్స్‌లో మంచి అభివృద్ధి నెలకొంది.యువత తమకు సరైన జోడీని( Matrimonial Apps ) సెలెక్ట్ చేసుకోవటానికి కూడా వెబ్‌సైట్‌లను మరియు యాప్‌లనే వాడుతున్నారనే విషయం విదితమే.







