భారత రైల్వే వ్యవస్థ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు.ఇక్కడ అతి తక్కువ వ్యయంతో సుదూర ప్రాంతాలకు పయనం కావచ్చు.
అందుకే ఇక్కడ సామన్యులు సైతం రైలు ప్రయాణాలకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.అయితే ఈ క్రమంలో అనేక ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయి.
అవి ఎక్కువగా వ్యక్తి తప్పిదాలే కావడం గమనార్హం.అందుకే రైలు నడిచే క్రమంలో అందులో నుంచి దిగే ప్రయత్నం గానీ, ఎక్కే ప్రయత్నంగానీ అసలు చేయనే చేయకూడదు.
బేసిగ్గా రైలు స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో రైలు స్పీడ్ కాస్త తగ్గుతుంది.ఈ సమయంలో కొందరు రైలు నుంచి దిగేటప్పుడు పొరపాట్లు చేసి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు.
ఏమాత్రం అజాగ్రత్త వ్యవహరించిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.ఇక అలాంటి ఘటనలకు చెందిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతునే ఉన్నాయి.అయినా.కొంత మంది ఈ విషయాన్ని గ్రహించక కంగారులోనో, మరేదో కారణం చేతనో ఇలా నిర్లక్ష్ష్యంగా వ్యవహరిస్తుంటారు.
ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్టో వైరల్ అవుతోంది.బీహార్‌లోని ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన ఈ భయంకర సంఘటన స్థానికులను కదిలించింది.
రైలు నడుస్తుండగా దిగే క్రమంలో ఓ మహిళ పట్టుకోల్పోయి.కాలు జారింది.
దీంతో ఆ మహిళ ప్లాట్‌ఫారమ్ కు, కదులుతున్న రైలు కిందకు మధ్య జారిపడింది.

సరిగ్గా అదేసమంయంలో అక్కడే వున్న RPF (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) అధికారి క్షణాల్లో అప్రమత్తమై.ఆ మహిళను బయటకు లాగాడు.అదే సమయంలో జనం కూడా అక్కడ గుమిగూడారు.
కాగా దీనికి సంబంధించిన వీడియోను RPF తన ట్విట్టర్ హ్యాండిల్‌తో షేర్ చేసింది.ఆర్‌పిఎఫ్ అధికారి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ మహిళకు కేవలం గాయాలు మాత్రమే అయ్యాయి.
లేకపోతే ప్రాణాలు పోయేవి.ఈ ఘటన మొత్తం రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.అందుకే కదిలే రైలునుండి దిగడం గాని, ఎక్కడం గాని చేయకుండదు.







