కొందరు మూవీ ఇండస్ట్రీలో యాక్టర్స్‌గా రాణిస్తున్నా వారిలో ఇతర ప్రతిభలు కూడా ఉంటాయి.వీటిని వీలు చిక్కినప్పుడు బయట పెడతారు.
ఆ సమయంలో మనం ఆశ్చర్యపోక తప్పదు.మరి అలా యాక్టింగ్ మాత్రమే కాకుండా వేరే ప్రతిభలతో, వేరే పనులు చేసి ఆశ్చర్యపరిచిన వారెవరో తెలుసుకుందాం.
• ఘట్టమనేని మంజుల
మహేష్ బాబు సిస్టర్ మంజుల( Manjula ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఆమె సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు.
అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తుంటారు.అయితే ఒకానొక సమయంలో ఆమె డైరెక్టర్‌గా కూడా సినిమా ఇండస్ట్రీలో పనిచేశారు “మనసుకు నచ్చింది” అనే సినిమాకి దర్శకత్వం వహించి ఆశ్చర్యపరిచారు.
ఆమెలో డైరెక్షన్ చేసే ప్రతిభ కూడా ఉందా అని చాలామంది నోరెళ్లపెట్టారు.
ఈ రొమాంటిక్ డ్రామాలో సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి, అదిత్ అరుణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
దీనిని మంజుల భర్త సంజయ్ స్వరూప్ ప్రొడ్యూస్ చేశాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.

• పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు.ఇతను మంచిగా నటిస్తారు.మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు.సంగీతంలో కూడా ప్రవేశం ఉంది.చాలా పాటలు కూడా పాడారు.అయితే ఇతడు తన బ్లాక్ బస్టర్ హిట్ ఖుషిలో ఫైట్ మాస్టర్ లేదా ఫైట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసి ఆశ్చర్యపరిచాడు.
ఈ సినిమాలో ఫైట్స్ చాలా వెరైటీగా ఉంటాయి.అవన్నీ అతడు ఓన్ గా క్రియేట్ చేసిన ఫైట్స్ అని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు.

• నటరాజన్ సుబ్రమణ్యం
నటరాజన్ సుబ్రమణ్యం( Natarajan Subramaniam ) “మహారాజా” సినిమాలో ఇన్స్పెక్టర్ ఎస్.వరదరాజన్‌గా యాక్ట్ చేసి మెప్పించారు.అయితే ఇతనిలో ఇంకొక టాలెంట్ ఉంది.అదే సినిమాటోగ్రఫీ.ఈ యాక్టర్ అ ఆ! సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.అతడు కెమెరా వర్క్ ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు.
దీన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడు.

• రేణు దేశాయ్
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) అతను హీరోగా నటించిన ఖుషి సినిమాని( Khushi Movie ) ఎడిట్ చేశారు.అంతే కాదు దానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసి ఆశ్చర్యపరిచారు.ఒకవేళ వీరిద్దరూ విడిపోక ఉండి ఉంటే రాజమౌళి దంపతుల వలె అనేక సినిమాల కోసం కలిసి పని చేసి ఉండేవారు.