టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.టాలీవుడ్ లో ఓ యంగ్ లేడీ ప్రొడ్యూసర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది.
హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ ప్రాంతంలో నివసించే లేడీ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ( Swapna Verma ) ఆత్మహత్య చేసుకొని మరణించింది.ఇక ఈ ఆత్మహత్య కేవలం ఆర్థిక కారణాలవల్ల జరిగినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు.
మాదాపూర్ లోని కావూరి హిల్స్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ నివాసం ఉంటుంది.
గత కొద్ది కాలం నుండి ఈవిడ టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry )లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తోంది.ఈమె సొంతూరు రాజమండ్రి.మూడు సంవత్సరాల క్రితం ఆమె సినీ ఇండస్ట్రీలో పని చేయడానికి హైదరాబాద్ కు చేరుకుంది.
ఆమె గత సంవత్సరం క్రితం నుండి మాదాపూర్ లోని కావూరి హిల్స్ లో ఉన్న తీగల హౌస్ లో హౌస్ నెంబర్ 101 లో ఒంటరిగానే నివసిస్తుంది.ఆవిడ గత కొన్ని రోజుల నుంచి ఎటువంటి ప్రాజెక్టు లేకుండా ఖాళీగా గడిపేస్తుంది.
కొన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన ఆవిడ గత ఆరు నెలల నుండి ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడంతో ఇంటికే పరిమితమైంది.అయితే గడిచిన రెండు రోజుల క్రితం తన నివసిస్తున్న ప్లాట్ లోనే ఆవిడ ఫ్యాన్ కు ఉరేసుకొని మరణించింది.సంఘటన రెండు రోజుల క్రితం జరగడంతో బాడీని ఎవరు గమనించకపోవడంతో బాడీ డి కంపోస్ట్ అవడంతో చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు అందించడంతో అసలు విషయం బయటపడింది.సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.