అక్కడికి వెళితే బప్పి లాహిరి బంగారు ఆభరణాలు చూడొచ్చు!

ప్రముఖ గాయకుడు బప్పి లాహిరికి బంగారంపై ఉన్న ప్రేమ ప్రపంచానికి తెలిసిందే.ఇటీవల మరణించిన బప్పి లాహిరి తాను జీవించివున్న రోజుల్లో భారీగా బంగారాన్ని సేకరించారు.

 Bappi Lahiri Gold Collection Would Be Put To A Museum , Goldman Of India, Buppy-TeluguStop.com

ఈ కారణంగానే అతను ‘గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా‘ అని కూడా పేరొందారు.బప్పీ లాహిరి కుమారుడు బప్పా లాహిరి ఈ బంగారు ఆభరణాలను ఏమి చేయనున్నారనేది వెల్లడించారు.

ఫిబ్రవరి 15, 2022న మరణించిన బప్పి లాహిరి నిత్యం బంగారు ఆభరణాలు వేసుకుని కనిపించేవారు.అలాగే ఆభరణాల సేకరణలో పేరొందారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం అతని కుమారుడు బప్పా లాహిరి బంగారం సేకరణ తన తండ్రికి ఫ్యాషన్ మాత్రమే కాదన్నారు.అతను బంగారంతో ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యేవారన్నారు.

గాయకుడు బప్పి లాహిరి తాను ధరించాలనుకునే ఏదైనా ఆభరణాన్ని సేకరిస్తారని, ఆపై దానిని బంగారంతో తయారు చేయించేవారని అతను వెల్లడించాడు.

ప్రముఖ గాయకుడు బప్పి లాహిరి కుమారుడు బప్పా లాహిరి తన తండ్రికి బంగారంతో ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని వెల్లడించారు.

తన తండ్రి బంగారం లేకుండా ఎప్పుడూ ప్రయాణించలేదు.తెల్లవారుజామున 5 గంటల విమాన ప్రయాణం అయినా బంగారు ఆభరణాలు ధరించేవారన్నారు.ఇది అతనికి ఎంతో శక్తినిచ్చేదన్నారు.తన తండ్రి బంగారాన్ని, ఆధ్యాత్మితను ముడిపెట్టేవారన్నారు.

అందుకే తాము తండ్రి ధరించిన ఆభరణాలను సంరక్షించబోతున్నామన్నారు.బప్పి లాహిరికి బంగారంతో ప్రత్యేక అనుబంధం ఉన్నందున, దానిని భద్రపరచాలని.

ఈ అసాధారణమైన బంగారు సేకరణను మ్యూజియంలో ఉంచాలని నిర్ణయించుకున్నట్లు అతని కుమారుడు వెల్లడించాడు.బప్పి ధరించిన యొక్క బూట్లు, సన్ గ్లాసెస్, టోపీలు, గడియారాలు, ఇతర ఆభరణాలను ముంబైలో ఏర్పాటు చేయబోయే ప్రదర్శనశాలలో ఉంచుతామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube