బేసిగ్గా ఇక్కడ అందరికీ ATM అంటే ఏం గుర్తుకు వస్తోంది? డబ్బులు విత్‌డ్రా లేదా డిపాజిట్ చేసే మెషీన్ అనే అనుకుంటారు.అయితే నేటి టెక్నాలజీ ప్రపంచంలో రకరకాల ATMలు రూపుదిద్దుకుంటున్నాయి.
ఇది మీరు గమనించివుంటారు… సాధారణంగా అనేకమంది ATMకి వెళ్లినపుడు బయటివారు మన ఖాతా వివరాలు తెలుసుకొని డబ్బులు దోచుకుంటారేమోనన్న భయంతో, అనుమానంతో ట్రాన్సాక్షన్ ముగిసిన తర్వాత నంబరు బోర్డుపై ఏవేవో పిచ్చి అంకెలు నొక్కేసి బయటకు వచ్చేస్తూ వుంటారు.
ఆ రకంగా చేస్తే బ్యాంకులో ఉన్న నిల్వ మొత్తం, ఇతర వివరాలు ఎవరికీ కనిపించకుండా వుంటాయని అనుకుంటారు.
అయితే అక్కడి ATM మాత్రం చాలా స్మార్ట్ అంది బాబూ.బ్యాంకు ఖాతాదారుల గుట్టంతా బయటకి చెప్పేస్తోంది.ఇంతకీ ఆ ATM ఎక్కడుందంటే, అమెరికాలోని మియామీ బీచ్‌లో ఏర్పాటు చేయబడిన ఆ ATMలో కార్డు పెట్టి ఎదురుగా నిలుచుంటే చాలు, కస్టమర్ ఫొటో తీసి ఖాతాలో ఎంత మొత్తం ఉందో చెప్పేస్తోంది.అవును, ATMపైన ఏర్పాటు చేసిన లీడర్ బోర్డుపై అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తోంది.
నిల్వ మొత్తం చూపెడుతూనే పక్కనే ఖాతాదారుడి ఫొటో కూడా కనిపించేలా చేస్తోంది.ఖాతాలో ఎక్కువ మొత్తం నిల్వ ఉన్న ఖాతాదారుడి పేరు మొదటి స్థానంలో ఉండి.అవరోహణ క్రమంలో సున్నా బ్యాలెన్స్ ఉన్న కస్టమర్ల పేర్లను చూపించడం విశేషం.కాగా ఈ ATMను న్యూయార్క్‌కు చెందిన MSCHF సంస్థతో కలిసి పెర్రోటిన్‌గ్యాలరీ అనే సంస్థ అభివృద్ధి చేసినట్టు భోగట్టా.
అయితే ప్రయోగాత్మకంగా దీనిని మియామీ బీచ్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో ఉంచారు.ఇక సాధారణ ATMలో మాదిరి ఇందులో కూడా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.