బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అయ్యప్ప భక్తులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా పడింది.
వేమూరు మండలం జంపని దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు.
మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే బాధితులను తెనాలి ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.