బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ ( Bigg Boss ) రియాలిటీ షో ఒకటి.అన్ని భాషలలోను ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ షో ప్రస్తుతం తెలుగులో మాత్రం ఏడవ సీజన్ ప్రసారమవుతుంది.ఈ సీజన్లో భాగంగా ఇప్పటికే మూడు వారాలు పూర్తికాగా త్వరలో 4వ వారం కూడా పూర్తికానుంది.14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్ లో బయటకు వెళ్లిపోయారు.ఇకపోతే తాతగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్లకు ఒక గాల ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ కూడా విభిన్న రకాలుగా తయారయ్యి ప్రేక్షకులను మెప్పించాలి అని చెప్పారు.దీంతో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణలో ఈ గాల ఈవెంట్లో సందడి చేశారు.ఇక ఈవెంట్లో భాగంగా ప్రియాంక జైన్ ( Priyanka Jain ) రాక్షసి లాగా తయారయ్యి సందడి చేశారు.
అలాగే టేస్టీ తేజ ( Tasty Teja )తన పేరుకు తగ్గట్టుగానే కిచెన్ లో ఉన్నటువంటి కూరగాయలన్నింటిని కూడా వంటికి తగిలించుకొని విభిన్న రీతిలో ముస్తాబయ్యారు.ఈ విధంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కో విధంగా విచిత్రమైనటువంటి గెటప్స్ లో సందడి చేశారు.
ఇక ఈ గాల ఈవెంట్ లో ఆట సందీప్ శోభ శెట్టి యాంకర్లుగా వ్యవహరిస్తూ ఒక్కొక్క కంటెస్టెంట్ ను వేదిక పైకి పిలుస్తూ షో చేయమని చెప్పారు.మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా కంటెస్టెంట్లతో బిగ్ బాస్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి భారీగానే ప్లాన్ చేశారని ఈ ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది.ఇక ఈ వీడియో పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతూ పలానా కంటెస్టెంట్ బాగున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఇదేంటి బిగ్ బాస్ కార్యక్రమంలో ఇలాంటి ఒక వింత షో ఏర్పాటు చేశారు ఒక్కొక్కరు ఒక్కో వింతగా ఉన్నారు అంటూ కంటెస్టెంట్లపై రోల్ చేయడం మొదలుపెట్టారు.