సాధారణంగా సినిమా హీరోలు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు.ప్రతి సినిమాకి ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు.
ఇక వాణిజ్య ప్రకటనలు అదనం.అయితే ఇలా సంపాదించిన మొత్తాన్ని ఎంతో మంది వివిధ వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు.
కొంతమంది హీరోలు వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా రియల్ ఎస్టేట్ లో మాత్రం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పాలి.ఒకప్పటి స్టార్స్ దగ్గర నుంచి ఈ జనరేషన్ వరకు కూడా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతుంటారు.
ఇక ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు థియేటర్ల ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్లక పోవడం గమనార్హం.
సినిమాలతో పాటు యాడ్స్ మీలో ఎవరు కోటీశ్వరుడు బిగ్ బాస్ షో ద్వారా హోస్టింగ్ చేస్తున్నాడు.ఇక తన సంపాదించిన మొత్తాన్ని అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ప్రొడక్షన్ హౌస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఎన్టీఆర్.
ఇక చరణ్ మాత్రం ఇక తన సంపాదనను ఎన్నో సెక్టార్ లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడట.నిన్నటి వరకు ఒక ఎయిర్వేస్లో ఇన్వెస్ట్ చేసిన చరణ్ ఇప్పుడు ఉపాసనతో కలిసి హెల్త్ ప్రొడక్ట్స్ స్టార్టప్ కంపెనీ లో కూడా పెట్టుబడులు పెడుతున్నాడు.
ఓవైపు కొణిదెల ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు.అంతే కాకుండా టాప్ బ్రాండ్లలో కూడా పెట్టుబడులు పెడుతున్నారట.

ప్రతి సినిమాకి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే బన్నీ ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల్లో కూడా దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్.ఏషియన్ గ్రూప్ తో కలిసి హైదరాబాద్ లో ఒక మల్టీప్లెక్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.ఫేమస్ థియేటర్ ను మల్టీప్లెక్స్ గా మార్చే ఆలోచనలో ఉన్నారట.ఆహా ఓటిటి యాప్ డెవలప్మెంట్ కి కూడా ఇన్వెస్ట్ చేశారట అల్లు అర్జున్.
స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు 25 కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు.ఎన్నో వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ కూడా థియేటర్ బిజినెస్ లోకి దిగి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఎషియాన్ గ్రూప్తో కలిసి దేవరకొండ మల్టీప్లెక్స్ నిర్మించాడు.అంతేకాకుండా సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం గమనార్హం.
రౌడీ బ్రాండ్ ఇప్పటికే ఉంది అన్న విషయం తెలిసిందే.

జూనియర్ హీరోలతో పాటు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు కూడా పెట్టుబడులలో కాస్త స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు.ఇప్పటికే రియల్ ఎస్టేట్ తో పాటు ప్రొడక్షన్ లో కూడా పెట్టుబడులు పెట్టారు హీరోలు.బాలకృష్ణ హెల్త్ రిలేటెడ్ మెడికల్ ఫీల్డ్ లో ఇన్వెస్ట్ చేయగా.
నాగార్జున రెస్టారెంట్ మాల్స్ బిజినెస్ చేశారు.కేవలం హీరోలు మాత్రమే కాదు టాలీవుడ్ లో హీరోయిన్లు గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సెంటర్లు నిర్వహిస్తూ బిజినెస్ చేస్తుంది.
సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ కూడా స్టార్ట్ చేసింది.రెస్టారెంట్లతో పాటు మరికొన్ని స్టార్టప్ లో కూడా ఇన్వైట్ చేస్తోంది.
కాజల్ సొంతంగా డెకర్స్ బిసినెస్ చేస్తుంది.సమంత ఏకం స్కూల్ తోపాటు సాకి సొంత బ్రాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.