సివిల్స్ ఫలితాలలో మూడో ర్యాంక్ సాధించిన తెలుగమ్మాయి అనన్య.. గ్రేట్ అంటూ?

ఒక వ్యక్తి కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలంటే ఆ సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంటుందనే సంగతి తెలిసిందే.తాజాగా సివిల్స్ ఫలితాలు( Civils Results ) విడుదల కాగా ఈ ఫలితాలలో తెలంగాణకు( Telangana ) చెందిన యువతి మూడో ర్యాంక్ సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

 Upsc Civils Third Ranker Telangana Girl Donuru Ananya Reddy Inspirational Story-TeluguStop.com

మహబూబ్ నగర్ కు చెందిన అనన్య రెడ్డి( Ananya Reddy ) మూడో ర్యాంక్ సాధించడం గమనార్హం.రోజుకు 14 గంటలు ప్రిపేర్ అయిన అనన్య రెడ్డి ఎంతో కష్టపడి లక్ష్యాన్ని సాధించారనే చెప్పాలి.

తొలి ప్రయత్నంలోనే అనన్య రెడ్డి ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారంటే ఆమె టాలెంట్ ఏంటో సులువుగానే అర్థమవుతుంది.అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన అనన్య తాను జియోగ్రఫీలో డిగ్రీ చేశానని డిగ్రీ చదువుతున్న సమయంలోనే తాను సివిల్స్ పై దృష్టి పెట్టానని అన్నారు.

ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఎంచుకున్నానని చెప్పుకొచ్చారు.హైదరాబాద్ లో సివిల్స్ కోసం కోచింగ్ తీసుకున్నానని ఆమె అన్నారు.

Telugu India Ranker, Civils Ranker, Donuruananya, Telangana, Upsc Civils-Movie

మంచి ర్యాంక్ వస్తుందని భావించాను కానీ మరీ మూడో ర్యాంక్( Third Rank ) వస్తుందని తాను ఊహించలేదని ఆమె చెబుతున్నారు.బాల్యం నుంచి సామాజిక సేవ చేయాలనే భావన నాలో ఉందని ఆమె పేర్కొన్నారు.అమ్మ గృహిణి అని నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ అని అనన్య వెల్లడించారు.తమ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయి తానేనని అనన్య రెడ్డి పేర్కొన్నారు.

Telugu India Ranker, Civils Ranker, Donuruananya, Telangana, Upsc Civils-Movie

గతేడాది తెలంగాణకు చెందిన ఉమా హారతి మూడో ర్యాంక్ సాధించగా ఈ సంవత్సరం అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించడం గమనార్హం.అనన్య సక్సెస్ స్టోరీ( Ananya Success Story ) నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది.సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఎంతోమంది తెలుగు విద్యార్థులకు అనన్య స్పూర్తి అని చెప్పవచ్చు.దోనూరు అనన్య రెడ్డి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube