ఒక్కో దర్శకుడికి ఒక్కో ఇమేజినేషన్ ఉంటుంది.తన హీరో ఎలా ఉండాలి ? ఎలా ఉంటే అది వర్కౌట్ అవుతుంది అనే అంచనా తోనే సినిమా తీస్తాడు.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు వారికి నచ్చినట్టుగా ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకుంటున్నారు.ఉదాహరణకు లోకేష్ కనగరాజ్ ని( Lokesh Kanagaraj ) తీసుకుందాం.
ఆయన సినిమాల్లో హీరోలు మరో ప్రపంచం లోకి తీసుకెళ్తారు. ఖైదీ సినిమాలో( Khaidi ) కార్తీ పాత్రను లియో( Leo ) చిత్రంలో విజయ్ తో పోల్చి చూసుకున్నారు.
ఈ రెండు పాత్రలు కూడా ఒకే రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి.ఇది లోకేష్ కనగరాజ్ సినిమాకి యూనివర్స్ అనే పదానికి అర్థం తెచ్చిన సినిమాలు.
ఇక ప్రశాంత్ నీల్( Prasanth Neel ) విషయం తీసుకుంటే కేజిఎఫ్( KGF ) సినిమాలోని తన హీరోల పాత్రను సలార్( Salaar ) సినిమాలో చూపించాలని ప్రయత్నం చేశాడట కానీ అది కుదరలేదు.ఇప్పుడు కే జి ఎఫ్ 3, సలార్ సీక్వెల్ సినిమాలు సిద్ధమవుతున్నాయి కాబట్టి ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో హీరోలంతా ఒకేలా ప్రవర్తిస్తారా లేదా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది.మరోవైపు డైరెక్టర్ హరి( Director Hari ) కూడా తన హీరోలను పోలీస్ క్యారెక్టర్స్ లో ఎక్కువగా చూపిస్తాడు కాబట్టి తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ఉంది.సింగం 3 సినిమా తీస్తున్న టైం లో క్లైమాక్స్ లో స్వామి లోని విక్రమ్ క్యారెక్టర్ ని పెట్టాలని ప్రయత్నించిన ఆ సమయానికి విక్రమ్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో అది కుదరలేదట.
దాంతో ఈ కాంబినేషన్ మిస్ అయింది.
ఇక సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) కూడా తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ నీ క్రియేట్ చేసుకున్నారు.తన హీరో పాత్రలు అన్ని కూడా చాలా వాయిలెంట్ గా ప్రవర్తిస్తూ ఉంటాయి.ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్( Spirit Movie ) అనే సినిమా తీస్తున్నాడు.
దాంట్లో అర్జున్ రెడ్డి నుంచి విజయ్ దేవరకొండ లేదంటే ఆనిమల్ నుంచి రణబీర్ కపూర్, కబీర్ సింగ్ నుంచి షాహిద్ కపూర్ ల ఏమైనా రిఫరెన్స్ తీసుకొని స్పిరిట్ సినిమా చేయబోతున్నాడా అనేది ఆయనని అడిగితే ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదు అంటున్నాడు.కానీ అలాంటిది ఒకటి జరిగితే కొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తాయి.
అలాగే వారి సినిమాటిక్ యూనివర్స్ కి కూడా న్యాయం జరుగుతుంది.