తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) వరుస సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో దేవర( Devara Movie ) అనే ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఎలాగైనా సరే తనని తాను ప్రువ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా మీద పాన్ ఇండియా లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో ఎన్టీఆర్ భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే( Pooja Hegde ) కనిపించబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.ఇక ఇంతకు ముందే పూజ హెగ్డే రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇక దాంతోపాటుగా ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాలో నటించింది.
అలాగే అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో అనే సినిమాలో కూడా నటించింది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి స్పెషల్ సాంగ్ లో ( Special Song ) నటించి మెప్పించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…
మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఆమె చేసే సాంగ్ కి మంచి గుర్తింపు వస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే.ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందో ఈమధ్య వచ్చిన చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి.
ఇక ఆయన ఇంతకు ముందు అజ్ఞాతవాసి లాంటి ఒక సినిమాకి మ్యూజిక్ ని అందించాడు.ఆ సినిమా మ్యూజికల్ గా చాలా బాగున్నప్పటికీ తెలుగు లో మాత్రం ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి.
ఇక ఈ సినిమా మ్యూజిక్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులందరిని అలరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…