తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చేసి అక్కడ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది.
కాగా తాప్సికి అలాగే బాలీవుడ్ హీరోయిన్ కంగానా రనౌత్ కి అసలు పడదు.కంగానా ఎప్పుడూ తాప్సీ ని చిన్నచూపు చేసి మాట్లాడడంతో,తాప్సీ కూడా కంగానా కు గట్టిగా కౌంటర్ ఇచ్చేది.
ఇది ఇలా ఉంటే తాజాగా తాప్సి దొబేరా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా మీద ఫైర్ అయ్యింది.
తాప్సి మీ సినిమాని నెటిజెన్స్ బాయ్ కాట్ చేస్తామంటున్నారు అని అడగగా దానికి తాప్సి మీరు చెప్పండి ఏ సినిమా బాయ్ కాట్ ని ఎదుర్కోవడం లేదో అని సీరియస్ అవుతూ ప్రశ్న అడిగేముందు అన్ని ఆలోచించండి అంటూ వారిపై మండిపడింది.
దానితో తాప్సి మీడియా మీద ఫైర్ అయిన వీడియోస్ ని నెటిజెన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసారు.దానితో బాగా హార్ట్ అయిన తాప్సి పన్ను దానికి వివరణ ఇస్తూ ఈ మధ్యన నేను జర్నలిస్ట్ లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చాలా వీడియోస్ ని వైరల్ చేసారు.
నాకు కెమెరా ముందు ఒకలా, బయట ఓ లాగా నటించడం చేతకాదు.ఉన్నది ఉన్నట్టు, అనుకున్నది అనుకున్నట్టుగా మట్లాడేస్తాను.

ఈ వీడియోస్ చూసి నెటిజెన్స్ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారు.నన్ను తిట్టారు.అవి చూసి నేను చాలా బాధపడ్డాను.అందుకే సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని, నాపై వచ్చే నెగెటివ్ వార్తలని చూడకూడదని ఫిక్స్ అయ్యాను అని చెప్పుకొచ్చింది తాప్సి.
అలాగే అందరిలా నాకు నటించడం రాదు, ఎవరో పొగుడుతారని ఆరాటపడను, కొంతమంది కెమెరా ముందు మాత్రమే కాదు, బయట కూడా నటిస్తారు.నాకు అది చేతకాదు.అనుకున్నది అనుకున్నట్లుగా మనస్ఫూర్తిగా మాట్లాడతాను అని తెలిపింది తాప్సీ.







